ETV Bharat / sports

నీరజ్​ చోప్రా, మిథాలీ రాజ్​కు ఖేల్​రత్న- ధావన్​కు అర్జున!

author img

By

Published : Oct 27, 2021, 5:26 PM IST

Updated : Oct 27, 2021, 6:56 PM IST

neeraj, shikar
నీరజ్, శిఖర్

17:22 October 27

నీరజ్​ చోప్రా, మిథాలీ రాజ్​కు ఖేల్​రత్న- ధావన్​కు అర్జున!

టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించిన జావెలిన్​ త్రో అథ్లెట్​ నీరజ్​ చోప్రా, రజతం గెల్చుకున్న రెజ్లర్​ రవి దహియాలను ఖేల్​ రత్నకు సిఫార్సు చేసింది కేంద్రం. మొత్తం 11 మంది అథ్లెట్లను 2021కిగానూ దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపిక చేసింది. ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన బాక్సర్​ లవ్లీనా బోర్గోహెయిన్​ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.  

ఈ అవార్డు దక్కించుకోనున్న మొదటి ఫుట్​బాల్ ఆటగాడిగా సునిల్ ఛెత్రి నిలిచాడు. క్రికెటర్ మిథాలీ రాజ్, హాకీ ఆటగాడు పీ శ్రేజేష్​ కూడా ఖేల్​ రత్న అవార్డుకు ఎంపికవడం విశేషం.  

పారా అథ్లెట్లకూ..

ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారాలింపిక్స్​ జరిగినందున మేజర్​ ధ్యాన్​చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంపికను వాయిదా వేసింది ప్రభుత్వం.  

షూటర్ అవని లేఖరా, మనీష్ నర్వాల్, జావెలిన్ త్రోవర్ సుమిత్ అంతిల్, షట్లర్లు ప్రమోద్ భగత్, క్రిష్ణా నాగర్​ టోక్యో పారాలింపిక్స్​లో బంగారు పతకం గెలిచారు. వీరందరి పేర్లను ఖేల్​ రత్నా అవార్డుకు సిఫార్సు చేసింది సెలక్షన్ కమిటీ.    

35 మందికి అర్జున..

35 మంది అథ్లెట్లను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసింది సెలక్షన్​ కమిటీ. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపించింది. ఇందులో క్రికెటర్ శిఖర్ ధావన్, పారా టీటీ ప్లేయర్ భవీనా పటేల్, పారా షట్లర్ సుహాస్ యతిరాజ్, హైజంప్​ అథ్లెట్ నిషాద్ కుమార్​ ఉన్నారు. 

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యుల పేర్లనూ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది సెలక్షన్ కమిటీ. 

Last Updated :Oct 27, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.