ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ మరోసారి స్వైటెక్​ సొంతం

author img

By

Published : Jun 4, 2022, 8:18 PM IST

Updated : Jun 4, 2022, 8:50 PM IST

స్వైటెక్
స్వైటెక్

ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ స్వైటెక్​ సత్తా చాటింది. అమెరికాకు చెందిన కోకోగాఫ్​ను ఓడించి మరోసారి టైటిల్​ను సొంతం చేసుకుంది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం.1 ఇగా స్వైటెక్‌ విజేతగా నిలిచింది. పోలెండ్‌కు చెందిన స్వైటెక్‌.. ఫైనల్‌ పోరులో అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై సునాయాసంగా గెలుపొందింది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. ఫోర్‌ హ్యాండ్‌, బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడుతూ.. ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన స్వైటెక్‌ ఈ పోరును కేవలం 70 నిమిషాల్లోనే ముగించడం విశేషం.

ఈ గెలుపుతో ఆమె రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే స్వైటెక్​ ఖాతాలో.. 2020లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచిన తొలి పోలెండ్‌ సింగిల్స్‌ క్రీడాకారిణిగా రికార్డు ఉంది.

ఇదీ చూడండి : డబ్బు కోసమే అదంతా చేస్తున్నాను.. సిగ్గు పడట్లేదు: గంభీర్​

Last Updated :Jun 4, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.