ETV Bharat / sports

రొనాల్డో ఇన్​స్టా ఫాలోవర్లు 40 కోట్లు.. మెస్సీ, కోహ్లీ ఎక్కడ?

author img

By

Published : Feb 8, 2022, 8:10 PM IST

Cristiano Ronaldo: ప్రముఖ సాకర్​ స్టార్​, పోర్చుగల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అతడి ఇన్​స్టాగ్రామ్​ ఫోలోవర్స్​ సంఖ్య 400 మిలియన్లు దాటింది. మరి భారతీయుల్లో టాప్​ ఎవరు? కోహ్లీ, ప్రియాంక చోప్రాల స్థానం ఎంత?

cristiano-ronaldo-becomes-worlds-first-person-to-reach-400-million
cristiano-ronaldo-becomes-worlds-first-person-to-reach-400-million

Cristiano Ronaldo: పోర్చుగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ఆటతోనే కాకుండా ఇప్పుడు మరో అరుదైన ఘనతతో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైన వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి. మరి అలాంటి ఇన్​స్టాలో క్రిస్టియానా రొనాల్డో అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు.

ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు (40 కోట్లు) పైగా ఫాలోవర్లను సంపాదించిన ఏకైక తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం మొత్తం రొనాల్డోను ఇన్‌స్టాలో 40, 00,47,023 మంది అనుసరిస్తున్నారు. రొనాల్డో కంటే సోషల్‌ మీడియా అధికారిక సంస్థ 'ఇన్‌స్టాగ్రామ్‌'కు మాత్రమే అధిక సంఖ్యలో (46,91,25,376 మంది) ఫాలోవర్లు ఉన్నారు. గతేడాది జనవరి నాటికి కేవలం 20 కోట్లు మాత్రమే ఉన్న ఫాలోవర్ల సంఖ్య సంవత్సరం తిరిగేసరికి రెట్టింపు కావడం విశేషం. గత శనివారం రొనాల్డో 37 ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో తన జీవిత భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి ఫొటో షేర్‌ చేశాడు.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో తర్వాత మోడల్‌ కైలీ జెన్నెర్ (30.86 కోట్లు), ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ (30.62 కోట్లు), యాక్టర్‌ డ్వేనె జాన్‌సన్ (29.57 కోట్లు) తర్వాతి వరుసల్లో ఉన్నారు. టీమ్ఇండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లీ 18.25 కోట్ల మంది ఫాలోవర్లతో ప్రపంచవ్యాప్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. అయితే భారత్‌ నుంచి టాప్‌ స్థానం కోహ్లీదే. ఇదే వరుసలో కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రాను (వరల్డ్‌లో 38వ స్థానం) 7.39 కోట్ల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ను (47వ స్థానం) 6.87 కోట్ల మంది, నేహా కక్కర్ (49వ స్థానం) 6.76 కోట్ల మంది, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (52వ స్థానం) 6.53 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.

ఇవీ చూడండి: సరికొత్త ఫీచర్​.. ఇన్​స్టాలో ఇక నెలనెలా సంపాదించుకోవచ్చు..!

అరియానాకు అషురెడ్డి హాట్​ కిస్​.. ఎక్కడ పెట్టిందో తెలిస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.