ETV Bharat / sports

బ్రిస్బేన్ వేదికగా 2032 ఒలింపిక్స్​ ​

author img

By

Published : Jul 21, 2021, 2:40 PM IST

Updated : Jul 21, 2021, 3:05 PM IST

2032 ఒలింపిక్స్​ను బ్రిస్బేన్​లో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. చివరిసారిగా 2000 సంవత్సరంలో సిడ్నీ విశ్వక్రీడలకు వేదిక కాగా.. తిరిగి 32 ఏళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియాకు ఈ సువర్ణావకాశం దక్కింది.

brisbane, 2032 olympics
బ్రిస్బేన్, 2032 ఒలింపిక్స్

2032 ఒలింపిక్స్​ ఆతిథ్య హక్కులను బ్రిస్బేన్​కు కేటాయించింది అంతర్జాతీయ ఒలింపిక్​ సంఘం. ఐఓసీ 138వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. "35వ ఒలింపిక్స్​ క్రీడలకు ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బ్రిస్బేన్​కు అభినందనలు" అని వెల్లడించింది.​ 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిస్బేన్‌ను ప్రతిపాదించాలని ఐఓసీ(IOC) ఎగ్జిక్యూటివ్ బోర్డు జూన్‌లోనే నిర్ణయించింది.

1956 విశ్వక్రీడలను మెల్​బోర్న్​ వేదికగా నిర్వహించగా.. 2000 సంవత్సరంలో సిడ్నీలో మరోసారి మెగా ఈవెంట్​ జరిపారు. 32 ఏళ్ల అనంతరం మరోసారి ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్​ జరగనున్నాయి. ఇక 2024 ఒలింపిక్స్​కు పారిస్​ ఆతిథ్యమివ్వనుండగా.. 2028లో లాస్​ ఏంజెల్స్​ వేదికగా ఈ మెగా క్రీడలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: ఒలింపిక్స్: ఈసారి వాటికి దూరం- అతిథులూ తక్కువే!

Last Updated : Jul 21, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.