ETV Bharat / sports

'కాలం చెల్లిన పరికరాలతో డోపింగ్​ టెస్ట్ చేశారు'- NADAపై భజరంగ్​ పూనియా సంచలన ఆరోపణలు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 12:30 PM IST

Updated : Dec 14, 2023, 1:04 PM IST

Bajrang Punia Allegations On NADA : స్టార్​ ఇండియన్ రెజ్లర్ భజరంగ్ పూనియా జాతీయ యాంటీ డోపింగ్​ ఏజెన్సీ- ఎన్​ఏడీఏపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆ ఏజెన్సీ కాలం చెల్లిన పరికరాలతో డోపింగ్ పరీక్షలు చేసిందని ఆరోపణలు గుప్పించాడు. ఇంకా ఏమన్నాడంటే?

Bajrang Punia Allegations On NADA
Bajrang Punia Allegations On NADA

Bajrang Punia Allegations On NADA : ప్రముఖ భారత రెజ్లర్, ఒలింపిక్ వీరుడు భజరంగ్​ పూనియా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ- ఎన్​ఏడీఏపై సంచలన ఆరోపణలు చేశాడు. కాలం చెల్లిన పరికరాలతో ఆ ఏజెన్సీ డోపింగ్ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపించాడు. తనకు డోపింగ్ టెస్ట్​ చేయడానికి వచ్చిన ఎన్​ఏడీఏ బృందం కాలం చెల్లిన పరికరాలను ఉపయోగించిందన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో డోపింగ్ పరికరాల ఫొటోలను చూపించాడు. అంతేకాకుండా ఈ డోపింగ్​ ఏజెన్సీతో జాగ్రతా ఉండాలంటూ యువ రెజ్లర్లను హెచ్చరించాడు.

  • यह हम सभी के देखने और विचार करने के लिए बहुत महत्वपूर्ण वीडियो है। यदि प्रक्रिया का पालन नहीं किया गया तो सिस्टम पर भरोसा कैसे किया जाए। कोई यह कैसे सुनिश्चित कर सकता है कि पूरी प्रक्रिया में कोई हेराफेरी नहीं हुई है। यह किसी के साथ भी हो सकता है, खासकर जूनियर एथलीटों के साथ।… pic.twitter.com/weMSNGPq0m

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది మనందరం చూడవలసిన, పరిగణలోకి తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైన వీడియో. సరైన విధానాలను అనుసరించని వ్యవస్థను మేము ఎలా విశ్వసిస్తాము? మొత్తం ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎవరైనా ఎలా నిర్ధరిస్తారు? ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చు. ముఖ్యంగా జూనియర్‌ అథ్లెట్లకు సంభవించవచ్చు. దయచేసి డోపింగ్​కు సంబంధించిన మీ హక్కులు, ప్రక్రియ గురించి తెలుసుకోండి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. అథ్లెట్లు ఇలాంటి డోపింగ్​ టెస్ట్​ల సమయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను"
-- భజరంగ్ పూనియా, భారత రెజ్లర్

తాను ఎన్​ఏడీఏకు చెందిన ఏ అధికారినీ టార్గెట్​ చేయలేదని భజరంగ్ అన్నాడు. అదేసమయంలో ఇతరుల కోసం వారు ఎలా పనిచేశారో ఈ చర్య బహిర్గతం చేసిందని అధికారులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. 'నేను మీ తప్పును ఎత్తి చూపడం లేదు. మీ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అథ్లెట్లను డోప్ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. నాతో పాటు వినేశ్ ఫోగట్, సాక్షి వంటి ఇతర అగ్రశ్రేణి భారత రెజ్లర్లపై డోపింగ్ పరీక్షల వెనుక బ్రిజ్ భూషణ్ హస్తం ఉంది. బ్రిజ్ భూషణ్​ డోపింగ్​ వలలో ఓ అమ్మాయి చిక్కుకుంది. ఆమె పేరు నేను చెప్పదలచుకోలేదు. వాళ్లు కొంత మందికి డబ్బు ఆశ చూపారు. మరికొంత మందిని బెదిరించారు. ఇప్పుడు డోపింగ్​ కేసుల్లో ఇరికిస్తున్నారు.' అని భజరంగ్ పూనియా వీడియోలో ఆరోపించాడు.

భారత రెజ్లింగ్ సమాఖ్య- డబ్ల్యూఎఫ్ఐ​ మాజీ అధ్యక్షుడు బ్రిజ్​ భూషన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై భజరంగ్​తో పాటు పలువురు అగ్రశ్రేణి భారత రెజ్లర్లు దాదాపు 6 నెలల పాటు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. దీంతో స్పందించిన ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్- ఐఓసీ డబ్ల్యూఎఫ్​ఐకి ఎన్నికల జరిగేంతవరకూ ఇద్దరు వ్యక్తులతో అడ్​హాక్​ కమిటీని ఏర్పాటు చేసింది.

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 - ధారాళంగా పరుగులిచ్చిన భారత బౌలర్లు - ఇప్పుడేం చేస్తారో ?

'నేను అలా చేయడం మీరు చూశారా - చేస్తే నన్ను ఆపేవారు ఎవరు?'

Last Updated : Dec 14, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.