ETV Bharat / sports

Australian Open 2023 : క్వార్టర్స్​లో ఓటమి.. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సింధు ఔట్

author img

By

Published : Aug 4, 2023, 10:31 AM IST

Updated : Aug 4, 2023, 10:54 AM IST

Australian Open Badminton 2023 Sindhu : ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023​ క్వార్టర్స్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడింది. మహిళల సింగిల్స్​ క్వార్టర్స్​లో అమెరికా షట్లర్ బీవెన్‌ జాంగ్‌తో తలపడ్డ సింధు.. 12-21, 17-21 తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది.

Australian Open Badminton 2023
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023​ నుంచి సింధు ఔట్

Australian Open Badminton 2023 : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధు.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023​ క్వార్టర్స్​లో ఓడింది. మహిళల సింగిల్స్ శుక్రవారం జరిగిన క్వార్టర్స్​లో ప్రపంచ 12 ర్యాంకు అమెరికన్ షట్లర్ బీవెన్‌ జాంగ్‌​ (Beiwen Zhang )తో సింధు.. 12-21, 17-21 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Australian Open PV Sindhu : ప్రపంచ 17 ర్యాంకర్ సింధు.. 39 నిమిషాల పాటు సాగిన ఆటలో వరుసగా రెండు సెట్లలో ఓడింది. గతంలో ఇదే ప్రత్యర్థిపై 10 సార్లు తలపడిన సింధు.. 6 సార్లు నెగ్గింది. కానీ శుక్రవారం నాటి క్వార్టర్స్​లో 33 ఏళ్ల అమెరికన్ ప్రొఫెషనల్ జాంగ్‌​.. సింధుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం చలాయించి.. ఫైనల్స్​కు దూసుకెళ్లింది. దీంతో సింధుకు మరోసారి నిరాశ తప్పలేదు.

ఇదే టోర్నమెంట్​లో సింధు.. రౌండ్​ 32లో అష్మిత చాలిహను ఎదుర్కొంది. ఈ గేమ్​లో సింధు 21- 18, 21- 13 తేడాతో గెలిచింది. తర్వాత రౌండ్​ 16లో ఆకర్షి కష్యప్​ను ఢీకొంది. ఈ గేమ్​లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన సింధు.. 21-14, 21-10 తేడాతో గెలిచి క్వార్టర్స్​లో అడుగుపెట్టింది. కాగా సింధు ఎదుర్కొన్న ఈ ఇద్దరు కూడా భారత షట్లర్లే. ఇక తాజా ఓటమితో సింధు ఇంటి బాట పట్టింది.

కొన్ని రోజుల క్రితం.. విడుదలైన బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్​ పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది. ప్రస్తుతం తన వద్ద 14 టోర్నమెంట్స్​కు గాను 49,480 పాయింట్లు ఉన్నాయి. గతేడాది కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆ తర్వాత గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా సత్తా చాటలేకపోతోంది. వరుస టోర్నీల్లో ప్రారంభ రౌండ్లలోనే ఓటమిపాలైంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో సింధు చోటు కోల్పోయింది. స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 టోర్నీలో ఫైనల్‌ చేరుకోవడం మినహా ఈ సీజన్‌లో సింధు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు.

Last Updated :Aug 4, 2023, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.