ETV Bharat / sports

Australian Open : భారత షట్లర్ల మధ్య 'ఢీ'.. సెమీస్​లో ప్రియాన్షు X ప్రణయ్.. శ్రీకాంత్​ ఔట్..

author img

By

Published : Aug 4, 2023, 2:33 PM IST

Australian Open Badminton 2023 : ఆస్ట్రేలియా ఓపెన్​ 2023 నుంచి భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. అతడిని​ స్వదేశీ ప్లేయర్ ప్రియాన్షు ప్రజావత్​ 21 - 13, 21- 8 తేడాతో ఓడించి.. సెమీస్​లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్స్​లో షట్లర్ ప్రణయ్.. ఇండోనేసియా ఆటగాడిపై విజయం సాధించాడు. శనివారం భారత స్వదేశీ ప్లేయర్లు ప్రియాన్షు, ప్రణయ్​ల మధ్య సెమీస్​ జరగనుంది.

Australian Open Badminton 2023
ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ 2023

Australian Open Badminton 2023 : ఆస్ట్రేలియా ఓపెన్​ 2023లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్​కు షాక్ తగిలింది.​ క్వార్టర్ ఫైనల్స్​లో శ్రీకాంత్.. మరో భారత్ షట్లర్​ ప్రియాన్షు ప్రజావత్​తో తలపడి ఓటమిపాలయ్యాడు. ఏకపక్షంగా సాగిన ఈపోరులో ప్రియాన్షు 21 - 13, 21- 8 భారీ తేడాతో శ్రీకాంత్​పై గెలిచి సెమీస్​కు అర్హత సాధించాడు. ఈ ఓటమితో శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్​ 2023 ఎవరి జర్నీ ఎలా..

  • ఈ టోర్నీలో 32వ రౌండ్​లో న్యూజిలాండ్ ప్లేయర్ తాంగ్​తో తలపడ్డ ప్రియాన్షు.. 21 - 12, 21 - 16 తేడాతో గెలిచాడు.
  • 16వ రౌండ్​లో వాంగ్​ను ఎదుర్కున్న ప్రియాన్షు మొదటి సెట్​​ను 21 -8 తో నెగ్గాడు. తర్వాత అనూహ్యంగా పుంజుకున్న వాంగ్.. 21 - 13తో రెండో సెట్​​ గెలిచాడు. దీంతో మూడో సెట్​​ ఆడాల్సి వచ్చింది. ఇక విన్నర్ డిసైడర్ మూడో సెట్​​లో హోరాహోరీ పోటీ నడిచింది. ప్రియాన్షు ఆఖర్లో పుంజుకొని.. 21 - 19 స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కాడు.
  • స్టార్ షట్లర్ కిందాబి శ్రీకాంత్ 32వ రౌండ్ సులువుగా నెగ్గాడు. ప్రత్యర్థి నిషిమోటోపై 21 -18, 21 -7 తేడాతో వరుసగా రెండు సెట్ల​లో తిరుగులేని ఆధిపత్యం సాధించాడు.
  • ఇక 16వ రౌండ్​లో కూడా కిదాంబి తన జోరు ప్రదర్శించాడు. ఈ రౌండ్​లో ఎల్​.వై.సుతో తలపడిన శ్రీకాంత్.. 21- 10, 21-17 తేడాతో గెలుపొంది క్వార్టర్స్​లో అడుగుపెట్టాడు. ఇప్పుడు క్వార్టర్స్​లో ప్రియాన్షు చేతిలో ఓడిపోయాడు.

మరో క్వార్టర్స్​లో ఇండోనేసియా ప్లేయర్​​ గింటింగ్​తో తలపడ్డ భారత షట్లర్​ ప్రణయ్.. అద్భుత విజయం సొంతం చేసుకున్నాడు. ఈ పోరులో మొదటి సెట్​ను గింటింగ్ 21 - 16తో గెలిచాడు. తర్వాత రెండో సెట్​​లో పుంజుకున్న ప్రణయ్​ 17 - 21తో గింటింగ్​పై పైచేయి సాధించాడు. మూడో సెట్​లో ప్రత్యర్థిని అలవోకగా ఎదుర్కొన్న ప్రణయ్ 14 - 21తో ఓడించి.. సెమీస్​కు దూసుకెళ్లాడు. కాగా భారత షట్లర్లు ప్రియాన్షు, ప్రణయ్​ల మధ్యే శనివారం సెమీఫైనల్స్ మ్యాచ్ జరగనుంది.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.