ETV Bharat / sports

Australian Open 2022: సెమీస్​కు దూసుకెళ్లిన సిట్సిపాస్​, కొలిన్స్​

author img

By

Published : Jan 26, 2022, 7:06 PM IST

Australian Open 2022
Australian Open 2022

Australian Open 2022: ఆస్ట్రేలియా ఓపెన్​లో పురుషుల సింగిల్స్​లో స్టెఫానో సిట్సిపాస్ సెమీస్​కు దూసుకెళ్లాడు. మహిళ సింగిల్స్​లో మ్యాచ్​లో అమెరికా టెన్నిస్​ క్రీడాకారిణి డేనియల్ కొలిన్స్ సెమీస్​లోకి ప్రవేశించింది.

ఆస్ట్రేలియ ఓపెన్​లో గ్రీస్ టెన్నిస్ ప్లేయర్ స్టెఫానో సిట్సిపాస్.. సెమీస్​కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 11వ ర్యాంక్​ జన్నిక్ సిన్నర్​పై(ఇటలీ) 6-3, 6-4, 6-2 తేడాతో గెలిచాడు. సెమీస్​లో రెండో ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ (రష్యా) లేదా 9వ ర్యాంకు ఫెలిక్స్ అగర్-అలియాస్సిమ్​తో తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్‌లో అమెరికా టెన్నిస్​ క్రీడాకారిణి డేనియల్ కొలిన్స్ ఆస్ట్రేలియా ఓపెన్​ సెమీస్​లోకి అడుగుపెట్టింది. ప్రత్యర్థి అలైజ్​ కార్నెట్​తో(ఫ్రాన్స్​) జరిగిన హోరాహోరీ పోరులో 7-5 6-1 తేడాతో అతికష్టంగా విజయం సాధించింది.

ఇదీ చూడండి: 'షెడ్యూల్​లో మార్పులు చేయండి'.. బీసీసీఐకి లంక బోర్డు వినతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.