ETV Bharat / sports

Asian Games 2023 : భారత్‌కు తొలి స్వర్ణం.. వరల్డ్ రికార్డ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 8:22 AM IST

Updated : Sep 25, 2023, 9:16 AM IST

Asian Games 2023 : భారత్‌కు తొలి స్వర్ణం.. వరల్డ్ రికార్డ్​
Asian Games 2023 : భారత్‌కు తొలి స్వర్ణం.. వరల్డ్ రికార్డ్​

Asian Games 2023 India Gold Medal : ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. నేడు(సెప్టెంబర్ 25) 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే మొదటి పసిడి పతకం కావడం విశేషం.

Asian Games 2023 India Gold Medal : ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. నేడు(సెప్టెంబర్ 25) 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే మొదటి పసిడి పతకం కావడం విశేషం. రుద్రాంక్ష్‌ పాటిల్‌, ఐశ్వరీ తోమర్‌, దివ్యాన్ష్‌ పన్వర్‌ బృందం 1893.7 పాయింట్లను నమోదు చేసి ఈ మెడల్​ను సొంతం చేసుకుంది. ఇది వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును వీరి బృందం అధిగమించింది. మొత్తంగా షూటింగ్​లో ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు తాజా దానితో కలిపి మూడు మెడల్స్ వచ్చాయి.

వ్యక్తిగతంగానూ.. అలాగే 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో టీమ్​గా గోల్డ్ మెడల్​ను ముద్దాదడిన దివ్యాన్ష్‌, రుద్రాంక్ష్‌, తోమర్‌ వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరుకోవడం మరో విశేషం. తుది పోరు కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ మూడో స్థానం, తోమర్‌ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి.. ఈ ఫైనల్‌కు అర్హత సాధించారు.

రోయింగ్ విభాగంలోనూ మరో మెడల్​.. అలానే రోయింగ్ విభాగంలో మరో కాంస్య పతకం భారత్​కు దక్కింది. మెన్స్‌ ఫోర్ రోయింగ్‌ ఈవెంట్‌లోనూ ఈ మెడల్ దక్కింది. దీంతో రోయింగ్ విభాగంలో ఇప్పటివరకు నాలుగు మెడల్స్​ వచ్చాయి. కాగా, ఆదివారం (మొదటి రోజు) భారత్‌కు ఐదు పతకాలను ముద్దాడిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు సిల్వర్​ మెడల్స్​, ఓ బ్రాంజ్ మెడల్​.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.

  • 𝓢𝓱𝓸𝓸𝓽𝓲𝓷𝓰 𝓽𝓱𝓮𝓲𝓻 𝔀𝓪𝔂 𝓽𝓸 𝓽𝓱𝓮 𝓽𝓸𝓹! 🥇🇮🇳- 𝟏𝐬𝐭 𝐆𝐨𝐥𝐝 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚⚡🤩@RudrankkshP, @DivyanshSinghP7, and Aishwary Pratap Tomar have hit the bullseye and secured the 1️⃣st Gold for India in the 10m Air Rifle Men's Team event at the #AsianGames2022.… pic.twitter.com/wQbtEYX2CQ

    — SAI Media (@Media_SAI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asian Games 2023 : రోయర్ల జోరు.. షూటర్ల హోరు.. తొలి రోజు భారత్​కు ఐదు పతకాలు

Last Updated :Sep 25, 2023, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.