ETV Bharat / sports

Olympics: పురుషులకు మన్​ప్రీత్​.. మహిళలకు రాణీ రాంపాల్

author img

By

Published : Jun 22, 2021, 4:43 PM IST

manpreet singh, rani rampal
మన్​ప్రీత్ సింగ్, రాణీ రాంపాల్

టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల, మహిళల జట్లకు కెప్టెన్లతో పాటు వైస్ కెప్టెన్లను ప్రకటించింది హాకీ ఇండియా. పురుషుల జట్టుకు మిడ్ ఫీల్డర్​ మన్​ప్రీత్​ సింగ్ సారథ్యం వహించనుండగా.. ఉమెన్స్​ టీమ్​కు రాణీ రాంపాల్​ నాయకత్వం వహించనుంది.

టోక్యో ఒలింపిక్స్​లో హాకీ ఇండియా పురుషుల జట్టు కెప్టెన్​గా మిడ్​ ఫీల్డర్​ మన్​ప్రీత్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని హాకీ ఇండియా అధికారికంగా వెల్లడించింది. వైస్​ కెప్టెన్లుగా సీనియర్​ డిఫెండర్లు బిరేంద్ర లక్రా, హర్మన్​ప్రీత్ సింగ్ పేర్లను ప్రకటించింది.

"ఒలింపిక్స్​ క్రీడలు ప్రత్యేకమైనవి. అటువంటి గేమ్స్​లో పురుషుల హాకీ జట్టును నడిపించే బాధ్యత ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మొత్తంగా ఒలింపిక్స్​లో మూడో సారి పాల్గొనబోతున్నా. ఈసారి సారథిగా జట్టును నడిపించనున్నాను. ఈ అవకాశం నాకు గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా మా టీమ్​ బలమైన నాయకత్వమైన సమూహంగా తయారైంది. మహమ్మారి విసిరిన సవాళ్లను విజయవంతంగా అధిగమించి ఈ స్థితికి వచ్చాము. ఒలింపిక్స్​లో మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా."

-మన్​ప్రీత్ సింగ్, భారత హాకీ జట్టు కెప్టెన్.

గత నాలుగేళ్లుగా మన్​ప్రీత్ సారథ్యంలో భారత జట్టు కొన్ని మైలురాళ్లను అధిగమించింది. అందులో 2017 ఆసియా కప్​తో పాటు 2018 ఆసియన్​ ఛాంపియన్స్​ ట్రోఫీ, 2019 ఎఫ్​ఐహెచ్​ సిరీస్​ ఫైనల్​ను గెలుచుకుంది. 2018లో భువనేశ్వర్​ వేదికగా ఎఫ్​ఐహెచ్​ పురుషుల ప్రపంచకప్​లో క్వార్టర్స్​కు చేరింది మన్​ప్రీత్ సేన. 2020లో జరిగిన ఎఫ్​ఐహెచ్​ ప్రో లీగ్​లోనూ భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. మన్​ప్రీత్​ నేతృత్వంలో ర్యాంకింగ్స్​లోనూ అత్యుత్తమ స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు నాలుగో ర్యాంకులో ఉంది.

కెప్టెన్సీతో పాటు వైస్​ కెప్టెన్లుగా ఎంపికైన ముగ్గురిని అభినందించారు హాకీ కోచ్​ గ్రాహం రీడ్​. గత కొన్నేళ్లుగా వారు ముగ్గురు జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇద్దరు ఆటగాళ్లను వైస్​ కెప్టెన్లుగా ప్రకటించడం వల్ల మన నాయకత్వ బలమేంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.

మహిళలకు రాణీ..

ఇక భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్​గా రాణీ రాంపాల్ వ్యవహరించనుంది. వైస్ కెప్టెన్లుగా దీప్​ గ్రేస్, సవిత.. రాణీకి తోడుగా ఉండనున్నారు. గత కొన్నేళ్లుగా రాణీ.. భారత జట్టుకు గుర్తుండిపోయే విజయాలు అందించింది. 2017 ఆసియా కప్​తో పాటు, 2018 ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్​షిప్​లో రజతాలు, 2019 ప్రపంచ హాకీ సిరీస్​ ఫైనల్లో ట్రోఫీ ఇవన్నీ భారత జట్టును ర్యాంకింగ్​లో మెరుగుపరిచాయి.

ఇదీ చదవండి: 'షెడ్యూల్​ ప్రకారం ఒలింపిక్స్​ జరిగితే పతకం ఖాయం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.