ETV Bharat / sports

ఫుట్​బాల్​ దిగ్గజం మారడోనాకు శస్త్రచికిత్స

author img

By

Published : Nov 5, 2020, 8:02 AM IST

argentine foot ball star diego maradona undergoes successful brain surgery
అర్జెంటీనా ఫుట్​బాల్​ దిగ్గజానికి 'శస్త్రచికిత్స'

అర్జెంటీనా ఫుట్​బాల్​ దిగ్గజం మారడోనాకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. కనీసం 48 గంటలపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనాకు శస్త్రచికిత్స జరిగింది. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల నిర్వహించిన ఆపరేషన్​ విజయవంతమైనట్లు అతని వ్యవహారాలు చూసుకునే బృందం ప్రకటించింది. ఇది ఆరోగ్య సమస్యల వల్ల వచ్చిందా..? ఏదైనా ప్రమాదం వల్ల వచ్చిందా? అనేది తనకు గుర్తులేదని మారడోనా చెప్పినట్లు అతని వ్యక్తిగత వైద్యుడు లీపోల్డో పేర్కొన్నారు.

ఈ అర్జెంటీనా దిగ్గజం కనీసం 48 గంటల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. గత శుక్రవారం 60వ పుట్టినరోజు చేసుకున్న మారడోనా.. ప్రస్తుతం జిమ్నాసియా ఎస్‌గ్రేమా ఫుట్‌బాల్‌ క్లబ్​కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి:బట్టతలను ఫుట్​బాల్​గా భావించిన ఏఐ కెమెరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.