ETV Bharat / sports

WTC Final 2023 : నెట్స్​లో కోహ్లీ ఫుల్​ ప్రాక్టీస్​.. ఈ సూపర్​ రికార్డులు బద్దలవుతాయా?

author img

By

Published : Jun 5, 2023, 5:05 PM IST

WTC Final 2023 Kohli Records : టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ ఆసీస్​తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్​​ కోసం తీవ్రంగా ప్రాక్టీస్​ చేస్తున్నాడు. కోహ్లీ తన దూకుడును కొనసాగిస్తే ఇప్పటిదాకా పలు కీలక ఆటగాళ్ల పేరిట ఉన్న కొన్ని రికార్డులను బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ రికార్డులేంటంటే?

Virat Kohli WTC Final 2023 Records
ఆ రికార్డులను బద్దలుకొట్టేందుకు కోహ్లీ స్కెచ్​.. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్​..!

WTC Final 2023 Kohli Records : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్​ లండన్​లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరగనున్న​ మ్యాచ్​ కోసం టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ తీవ్రంగా కష్టపడుతున్నాడు. మంచి ఫామ్​లో ఉన్న విరాట్​ మరింత మెరుగైన ప్రదర్శనను ఇచ్చి టెస్ట్​ క్రికెట్​లో ఇప్పటివరకు పలు కీలక ఆటగాళ్ల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.

రిచర్డ్స్​ రికార్డు బ్రేక్​..?
Kohli vs viv Richards : ఇప్పటివరకు 108 టెస్టు మ్యాచుల్లో ఆడిన విరాట్​ కోహ్లీ 8,416 పరుగులు చేశాడు. ఆసీస్​తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడు మరో 125 పరుగులు చేయగలిగితే టెస్టు కెరీర్‌లో వెస్టిండీస్​ క్రికెట్​ లెజెండ్​ సర్ వివ్​ రిచర్డ్స్​ పేరిట ఉన్న 8540 పరుగుల రికార్డును బద్దలు కొడతాడు.

Virat Kohli WTC Final 2023 Records
విరాట్​ కోహ్లీ, వివ్​ రిచర్డ్స్

సెహ్వాగ్​ను దాటి సాధిస్తాడా..?
Kohli vs Shewag : టీమ్​ఇండియా లెజెండరీ బ్యాటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ తన టెస్ట్​ కెరీర్​లో మొత్తం 8,586 పరుగులు చేశాడు. ఆసీస్​తో జరగబోయే ఈ మ్యాచ్​లో​ కోహ్లీ 171 పరుగులు చేస్తే సెహ్వాగ్​ పేరిట ఉన్న రికార్డును దాటేస్తాడు. ఈ రికార్డు బద్దలు కొట్టడం కొంచెం కష్టమే అయినా.. కోహ్లీ​పై ఉన్న నమ్మకంతో అతడి ఫ్యాన్స్​​ 'విరాట్​ భాయ్'​ కచ్చితంగా ఈ మైలురాయిని ఛేదిస్తాడు అనే ధీమాతో ఉన్నారు.

దూకుడుతో ద్రవిడ్​ను దాటుతాడా..?
Virat Kohli vs Rahul Dravid : ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లలో రాహుల్​ ద్రవిడ్ ఒకడు. ప్రస్తుతం టీమ్​ఇండియా హెడ్ కోచ్​గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కూడా విరాట్​ బ్రేక్​ చేసేందుకు సిద్ధమయ్యాడు. టెస్టుల్లో 60 ఇన్నింగ్స్​ ఆడిన ద్రవిడ్​ 13 అర్ధశతకాలు, రెండు శతకాల సాయంతో 2143 పరుగులు చేశాడు. కంగారూలపై కోహ్లీ ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్​ ఆడి 1979 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 164 పరుగులు చేస్తే ద్రవిడ్‌ను రికార్డును బ్రేక్​ చేస్తాడు.

పాంటింగ్‌ను దాటేస్తాడా..?
Virat Kohli vs Ricky Pointing : ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్లు కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న 8 సెంచరీల రికార్డును కోహ్లీ ఈ టెస్ట్​ మ్యాచ్​లో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ మాత్రమే కాదు మరో ఆటగాడు స్టీవ్​ స్మిత్​ కూడా ఈ ఫీట్​ను సాధించేందుకు ఛాన్స్​ ఉంది. భారత్-ఆస్ట్రేలియా సిరీసుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో 11 శతకాలతో సచిన్ తెందూల్కర్​ అగ్రస్థానంలో ఉన్నాడు. 8 శతకాలతో పాంటింగ్​ రెండో స్థానంలో ఉండగా.. కోహ్లీ, స్మిత్​ ఎనిమిదేసి శతకాలతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వీళ్లిద్దరిలో ఎవరు సెంచరీ చేసినా వాళ్లు పాంటింగ్‌ను దాటేసే అవకాశం ఉంది. కానీ, సచిన్ రికార్డును బ్రేక్​ చేయడం మాత్రం వీళ్లకంత సులువు కాకపోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.