ETV Bharat / sports

'వార్నర్​ను విమర్శించడమంటే.. ఎలుగుబంటికి ఎదురెళ్లడమే'

author img

By

Published : Nov 15, 2021, 12:58 AM IST

టీ20 ప్రపంచకప్(T20 World cup)​ టైటిల్​ నెగ్గింది ఆస్ట్రేలియా(AUS vs NZ). ఈ విజయంపై ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్​ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. ​మరోవైపు న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​ పోరాడి ఓడిపోయామని అన్నాడు.

aus vs nz
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా(AUS vs NZ T20). న్యూజిలాండ్​పై 8 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి పొట్టి ప్రపంచకప్​ను ముద్దాడింది. కివీస్​ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ హర్షం వ్యక్తం చేశాడు.

"ఎట్టకేలకు ఆస్ట్రేలియా టీమ్​ పొట్టి ప్రపంచకప్​ నెగ్గింది. చాలా గర్వంగా ఉంది. టోర్నీ ఆరంభంలో తడబడినా వ్యక్తిగతంగా, టీమ్​గా రాణించగలిగాం. వార్నర్​ ఫామ్​పై అందరూ కామెంట్స్​ చేశారు. కానీ, అతడు ఫామ్​లోకి వచ్చి తనేంటో నిరూపించుకున్నాడు. వార్నర్​ను కామెంట్​ చేయడం అంటే ఎలుగుబంటితో ఆటలాడటం లాంటిదే. నా దృష్టిలో ఆడమ్ జంపానే ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్. మిచెల్​ మార్ష్​ అద్భుత ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. స్టోయినిస్, వేడ్​ బాగా ఆడారు."

--ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్.

పోరాడి ఓడాం..

'తొలుత బ్యాటింగ్​ చేసి మంచి భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేశాం. లక్ష్యం పెద్దదిగానే భావించాం. కానీ, ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. గెలిచేందుకు చివరివరకూ ప్రయత్నించాం. టీమ్​గా గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేసి పోరాడి ఓడిపోయామనే భావిస్తున్నా. దుబాయ్​లో గ్రౌండ్​ కండిషన్లు చాలా భిన్నంగా ఉన్నాయి. అయినా, పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆచితూచి ఆడాం. ఆటలో గెలుపోటములు సహజమే.' అని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్(kane williamson news) అన్నాడు.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(85) చెలరేగాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌(77), డేవిడ్‌ వార్నర్‌(53) వీరవిహారం చేశారు. ట్రెంట్ బౌల్ట్‌ (2/18) మినహా మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

ఇదీ చదవండి:

T20 World Cup: గత టీ20 వరల్డ్​కప్​ విన్నర్స్ వీళ్లే.. ఈసారి ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.