ETV Bharat / sports

WPL 2023 విజేత ముంబయి ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?.. పాక్​ లీగ్​ కన్నా డబుల్​!

author img

By

Published : Mar 27, 2023, 11:28 AM IST

wpl 2023 winner mumbai indians and other awards prize money details
wpl 2023 winner mumbai indians and other awards prize money details

మహిళల ప్రీమియర్​ లీగ్​ తొలి సీజన్​లో ముంబయి ఇండియన్స్​ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. అయితే ఈ విజయంతో ముంబయి గెలుచుకున్న ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?

మహిళల ప్రీమియర్​ లీగ్​ తొలి సీజన్​ అట్టహాసంగా ముగిసింది. తొలి విజేతగా ముంబయి ఇండియన్స్ జట్టు రికార్డు సృష్టించింది. దిల్లీ క్యాపిటల్స్​తో సాగిన ఫైనల్​ మ్యాచ్​లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌ ట్రోఫీని హర్మన్​ సేన.. ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ బీసీసీఐ.. ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో ఛాంపియన్​ ముంబయి, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

డబ్ల్యూపీఎల్‌ 2023 అవార్డులు, ప్రైజ్‌మనీ వివరాలు ఇలా..

  • విజేత- ముంబయి ఇండియన్స్‌- గోల్డెన్‌ ట్రోఫీ- రూ. 6 కోట్లు
  • రన్నరప్‌- దిల్లీ క్యాపిటల్స్‌ - రూ. 3 కోట్లు
  • మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌- హేలీ మాథ్యూస్‌ (ముంబయి ఇండియన్స్‌)- రూ. 5 లక్షలు
  • ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు)- మెగ్‌ లానింగ్‌ (దిల్లీ క్యాపిటల్స్‌)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు
  • పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్‌ (ముంబయి ఇండియన్స్‌)- 16 వికెట్లు
  • ఫెయిర్‌ ప్లే అవార్డు- ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌
  • క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌- హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (ముంబయి)- యూపీ వారియర్జ్‌ దేవికా వైద్య క్యాచ్‌- రూ. 5 లక్షలు
  • సఫారీ పవర్‌ఫుల్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌- సోఫీ డివైన్‌ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు
  • ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌- యస్తికా భాటియా (ముంబయి)- రూ. 5 లక్షలు

పాకిస్థాన్​ సూపర్‌ లీగ్‌ విజేత కంటే..
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ విజేతకు అందిన మొత్తం పీఎస్‌ఎల్‌ ఛాంపియన్‌ లాహోర్‌ కలందర్స్‌ గెలుచుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ విన్నర్‌గా అవతరించిన లాహోర్‌ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్‌ ముల్తాన్‌ సుల్తాన్స్‌ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది.

wpl 2023 winner mumbai indians and other awards prize money details
ట్రోఫీతో ముంబయి ఇండియన్స్​ టీమ్​

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35), శిఖా పాండే (27 నాటౌట్‌), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌) మినహ ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముంబయి బౌలర్లలో వాంగ్‌, హెయిలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అమీలా కెర్‌ రెండు వికెట్లు తీసింది. లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి విజయం అంత సులువుగా చిక్కలేదు. ఓపెనర్‌ యాస్తికా భాటియా (4), హెయిలీ మాధ్యూస్​(13) నిరాశపరిచారు. బ్రంట్‌.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌తో కలిసి ఆచితూచి ఆడారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జోరందుకున్న ఈ జోడీని కాప్సీ విడగొట్టింది. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్మన్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమీలా కెర్‌ (14 నాటౌట్‌) చక్కని సహకారం అందించడంతో.. మరో మూడు బంతులు మిగిలుండగానే ముంబయి లక్ష్యాన్ని ఛేదించి కప్పు అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.