విజృంభించిన సోఫీ డివైన్​.. ఒక్క రన్​తో సెంచరీ మిస్​.. ఆర్సీబీ ఘన విజయం

author img

By

Published : Mar 18, 2023, 10:36 PM IST

WPL 2023 Royal Challengers Bangalore vs Gujarat Giants

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్​లో గుజరాత్‌ జెయింట్స్​పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. సోఫీ డివైన్​(36 బంతుల్లో 99; 9x4,8x6) ధనాధన్ ఇన్నింగ్స్​ తోడవ్వడం వల్ల 189 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో ఛేదించింది.

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా నేడు(మార్చి 18) జరిగిన మ్యాచ్​లో గుజరాత్‌ జెయింట్స్​పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 275 స్ట్రైక్​ రేట్​తో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడిన సోఫీ డివైన్​(36 బంతుల్లో 99; 9x4,8x6) ఒక్క రన్​ తేడాతో సెంచరీ మిస్ చేసుకుంది. అలా సోఫీ అద్భుత ఇన్నింగ్స్ తోడవ్వడం వల్ల 189 పరుగుల లక్ష్యాన్ని.. 15.3 ఓవర్లలోనే రెండు వికెట్ కోల్పోయి ఆర్సీబీ ఛేదించింది. కెప్టెన్​ స్మతి మంధాన(37) స్నేహా రాణా బౌలింగ్​లో తొలి వికెట్​గా వెనుదిరిగింది. ఆ తర్వాత దూకుడుగా ఆడిన సోఫీ డివైన్ ఒకానొక దశలో 303 స్ట్రైక్​ రేట్​తో చెలరేగిపోయింది. అయితే ఆమె.. జట్టు స్కోరు 157 పరుగుల వద్ద కిమ్​ గార్త్​ బౌలింగ్​లో షాట్​కు యత్నించి అశ్వని కుమారికి క్యాచ్ ఇచ్చి ఔట్​ అయింది. ఇక చివర్లో వచ్చిన ఎల్లిస్​ పెర్రీ(19*), హీదర్ నైట్​(22*) స్కోరు బోర్డును ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. మొత్తంగా

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన గుజరాత్​లో ఓపెనర్‌ లూరా వోల్వార్డ్‌ (68; 42 బంతుల్లో 9×4,2×6) హాఫ్​సెంచరీతో విజృంభించగా.. సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4×4), గార్డెనర్‌ (41; 26 బంతుల్లో 6×4, 1×6) పరుగులు చేశారు. అయితే బ్యాటింగ్ ప్రారంభించగానే గుజరాత్​కు ఆదిలోనే షాక్​ తగిలింది. ప్రారంభంలోనే వికెట్​ కోల్పోయింది. డివైన్‌ బౌలింగ్​ మూడో ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ డంక్లీ (16) బౌల్డ్​ అయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మేఘన ఎంట్రీ ఇచ్చింది. ఆమె.. మరో ఓపెనర్‌ వోల్వార్డ్​తో కలిసి ఇన్నింగ్స్​ను నిర్మించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 90 పరుగులు నమోదు చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న ఈ జంటను ప్రీతి బోస్‌ విడగొట్టింది. 12వ ఓవర్‌ లాస్ట్ బాల్​లో రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి మేఘన ఔట్ అయింది. అయితే.. మరో ఎండ్‌లో ఉన్న వోల్వార్డ్‌ మాత్రం.. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌ గార్డెనర్‌తో కలిసి వరుస బౌండరీలు బాదింది. స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టించింది. అయితే, ఈ క్రమంలోనే శ్రేయాంక పాటిల్‌ వేసిన 17వ ఓవర్‌ లాస్ట్​ బాల్​కు ప్రీతికి క్యాచ్‌ ఇచ్చి వోల్వార్డ్‌ వెనుదిరిగింది. అప్పటికే జట్టు స్కోరు 142. అయితే అప్పుడే 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గార్డెనర్‌ కూడా ఔటవ్వడంతో స్కోరు వేగం తగ్గిపోయింది. ఆ తర్వాత హేమలత (16*), డియోల్‌ (12*) రన్స్​ చేయడంతో గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బౌలర్లలో శ్రేయంక పాటిల్‌ 2 వికెట్లు తీయగా.. సోఫీ డివైన్‌, ప్రీతి బోస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇదీ చూడండి: WPL 2023 : ముంబయిపై యూపీ వారియర్స్ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.