WPL 2023 : ముంబయిపై యూపీ వారియర్స్ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

author img

By

Published : Mar 18, 2023, 7:02 PM IST

Updated : Mar 18, 2023, 9:13 PM IST

WPL 2023 UP Warriorz won by 5 wickets

మహిళల ప్రిమియర్‌ లీగ్​లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్​లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. ఐదు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది.

మహిళల ప్రిమియర్‌ లీగ్​లో భాగంగా ముంబయితో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్​లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో ఐదు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. అలాగే డబ్ల్యూపీఎల్​లో ఓటమి ఎరుగని ముంబయికి పరాజయాం రుచి చూపించింది. ఇది ముంబయి జట్టుకు తొలి ఓటమి. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్​.. లక్ష్యాన్ని 19.3 ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తాహిలా మెక్‌గ్రాత్‌(38; 25 బంతుల్లో 6×4, 1×6), గ్రేస్‌ హారిస్‌ (39; 28 బంతుల్లో 7×4) జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కేర్‌ రెండు వికెట్లు తీయగా.. బ్రంట్‌, హెయిలీ మ్యాథ్యూస్‌, వోంగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ దేవికా వైద్య(1) ఒక్క పరుగు కూడా చేయకుండానే తీవ్ర నిరాశ పరిచింది. హెయిలీ వేసిన 1.1వ బాల్​కు.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్​ అయింది. మరో ఓపెనర్‌ హీలీ (8) కూడా వోంగ్‌ బౌలింగ్‌లో తక్కువ రన్స్​కే పెవిలియన్​ చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌తో కలిసి నవ్‌గిరే ఇన్నింగ్స్‌(12) నిర్మించడానికి ప్రయత్నం చేసింది. కానీ టీమ్​ స్కోరు 27 రన్స్​ వద్ద బ్రంట్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి భాటియా చేతికి చిక్కింది.

ఆ తర్వాత హారిస్‌తో కలిసి మెక్‌గ్రాత్‌ ఆచితూచి ఆడింది. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ ఇద్దరూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే, ఈ జోడీని అమీలియా కేర్‌ విడగొట్టింది. టీమ్​ స్కోరు 71 రన్స్​ దగ్గర మెక్‌గ్రాత్‌ కాట్‌ ఆండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగింది. కేర్‌ వేసిన 15.4వ బంతికి వోంగ్​కు క్యాచ్‌ ఇచ్చి హారిస్‌ కూడా ఔట్ అయింది. దీంతో జట్టు ఒక్కసారిగా మళ్లీ కష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (13*), సోఫీ (16*) చాలా కష్టంగా లక్ష్యాన్ని ఛేదించారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి టీమ్​ నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 127 రన్స్ చేసింది. ఓపెనర్‌ హీలీ మ్యాథ్యూస్‌ (35; 30 బంతుల్లో 1×4, 3×6) రన్స్​ చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (25), వోంగ్‌ (32) తప్ప మిగత వారు రాణించలేకపోయారు. యూపీ బౌలర్లలో ఎక్లెస్టోన్‌ 3 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్‌, దీప్తిశర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంజలి శ్రావణ ఒక వికెట్ తీసింది.

ఇదీ చూడండి: ఐపీఎల్​ అందాల యాంకర్లు.. వీరు మైదానంలో ఉంటే ఫ్యాన్స్​కు కిక్కే కిక్కు

Last Updated :Mar 18, 2023, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.