WPL 2023: ఉత్కంఠ మ్యాచ్​లో దిల్లీపై గుజరాత్​ విజయం.. ప్లే ఆఫ్​ ఆశలు సజీవం

author img

By

Published : Mar 16, 2023, 10:42 PM IST

Updated : Mar 16, 2023, 10:56 PM IST

Gujarat Gianta Delhi capitals

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​​పై గుజరాత్​ జెయింట్స్​​ విజయం సాధించింది. ఈ విజయంతో తన ప్లే ఆఫ్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​​పై గుజరాత్​ జెయింట్స్​​ విజయం సాధించింది. గుజరాత్​ బౌలర్లు చెలరేగడంతో.. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​.. 18.4 ఓవర్లలోనే ఆలౌట్​ అయిపోయింది. ఫలితంగా గుజరాత్​ జెయింట్స్​ 11 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మెగా టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. అలానే తన ప్లే ఆఫ్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. దిల్లీ క్యాపిటల్స్​​ జట్టులో మారిజన్నె కప్​(36) టాప్​ స్కోరర్​. అలిస్​ క్యాప్సె(22), మెగ్​ లాన్నింగ్​(18) పర్వాలేదనిపించారు. చివర్లో వచ్చిన అరుంధతి రెడ్డి(25) స్కోరు బోర్డును కాస్త పరుగులు పెట్టించింది. కానీ ఫలితం దక్కలేదు. గుజరాత్ బౌలర్లలో తనుజ కాన్వార్2, కిమ్​ గార్త్ 2​, అష్లెగ్​ గార్డ్నర్ 2​ వికెట్లు పడగొట్టగా.. స్నేహ్​ రానా, హర్లీన్​ డియెల్​ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్‌లో లూరా వోల్వార్డ్‌ (57; 45 బంతుల్లో 6×4, 6×1), గార్డెనర్‌ (51*; 33 బంతుల్లో 9×4) హాఫ్​సెంచరీలతో ఆకట్టుకున్నారు. డియోల్‌ (31) పర్వాలేదనిపించింది. అసలు బ్యాటింగ్​కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ సోఫియా(4) తక్కువ స్కోరుకే పెవిలియన్​ చేరింది. మరిజెన్నే వేసిన ఫస్ట్​ ఓవర్‌ లాస్ట్ బాల్​కే జోనాస్సేన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డియోల్‌తో కలిసి వోల్వార్డ్‌ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 53 రన్స్​ చేశారు. అయితే రెండో వికెట్‌ను కూడా జోనాస్సేన్‌ పడగొట్టింది. ఆమె వేసిన 9.5వ బాల్​కు భాటియాకు క్యాచ్‌ ఇచ్చి డియోల్‌ పెవిలియన్​ చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గార్డెనర్‌తో కలిసి వోల్వార్డ్‌ జోరు పెంచగా.. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెలెత్తించారు. జాగ్రత్తగా ఆడుతూనే.. వీలుదొరికినప్పుడల్లా బౌండరీలు బాదేశారు. అలా ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. అయితే, అరుంధతి వేసిన 18.4వ బాల్​కు వోల్వార్డ్‌ బౌల్డ్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హేమలతకు నిరాశే ఎదురైంది. కేవలం ఒక్క పరుగే చేసి ఔటయ్యింది. దీంతో గుజరాత్‌ కేవలం 147 పరుగులకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అలా గుజరాత్​ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో జొనాస్సేన్‌ 2 వికెట్లు పడగొట్టగా అరుంధతి రెడ్డి, మరిజెన్నే తలో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: IND VS AUS: వన్డే సిరీస్​కు రెడీ.. ఆ మూడు రికార్డులను కోహ్లీ అందుకుంటాడా?

Last Updated :Mar 16, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.