ETV Bharat / sports

World Cup 2023 Online Ticket : క్రికెట్‌ లవర్స్​ గెట్ రెడీ.. వరల్డ్‌ కప్‌ టికెట్లు అప్పటి నుంచే! వారికి స్పెషల్ ఆఫర్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 10:05 AM IST

World Cup 2023 Online Ticket : భారత్‌ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌-2023కు టికెట్లకు సంబంధించి 'బుక్‌ మై షో'ను తమ టికెటింగ్‌ భాగస్వామిగా బీసీసీఐ అనౌన్స్ చేసింది. టికెట్ల అమ్మకాలు ఎప్పుడు నుంచి జరగనున్నాయంటే..

BCCI announces BookMyShow as ticketing platform for World Cup
World Cup 2023 Online Ticket : క్రికెట్‌ లవర్స్​ గెట్ రెడీ.. వరల్డ్‌ కప్‌ టికెట్ల బుకింగ్‌ అప్పటి నుంచే.. వారికి స్పెషల్ ఆఫర్​!

World Cup 2023 Online Ticket : మరో 40 రోజుల్లో మెగా సమరం మొదలుకానున్న సంగతి తెలిసిందే. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023కు రంగం సిద్ధమైంది. అయితే మెయిన్ టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు వార్మప్​ మ్యాచులు.. హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి వేదికగా జరగనున్నాయి. భారత్‌ తమ తొలి వార్మాప్‌ మ్యాచ్​ను సెప్టెంబర్‌ 30న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్​తో గువహటి వేదికగా ఆడనుంది.

  • అయితే ఈ ప్రపంచ కప్‌ కోసం 'బుక్‌ మై షో'ను తమ టికెటింగ్‌ భాగస్వామిగా బీసీసీఐ అనౌన్స్ చేసింది. ప్రధాన మ్యాచ్‌లు, వార్మప్​ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను ఈ బుక్‌ మై షో ప్లాట్​ఫామ్​ ద్వారా కొనుగోలు చేయొచ్చని తెలిపింది.
  • టీమ్​ఇండియా మినహా ఇతర జట్ల వార్మప్​ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల ఆగస్ట్​ 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది. ఇండియాకు సంబంధించిన మ్యాచ్​ల టికెట్లు ఆగస్ట్​ 30 నుంచి అందుబాటులో ఉంటాయి.
  • అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులకు మాత్రం ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. ఒకరోజు ముందుగానే(ఆగస్ట్​ 24 సాయంత్రం 6 గంటల నుంచే) టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీమ్​ఇండియా ఆడే మ్యాచుల టికెట్లు ఆగస్ట్​ 29 సాయంత్రం 6 గంటల నుంచే ఉంటాయి.
  • టీమ్​ఇండియా ఆడే వార్మప్​ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల 30 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అలాగే టీమ్​ఇండియా ఆడే ప్రధాన టోర్నీ మ్యాచ్‌ టికెట్లను నాలుగు ధపాలుగా విడుదల చేయనున్నారు.
  • చెన్నై, దిల్లీ, పుణెలో టీమ్​ఇండియా ఆడే మ్యాచ్‌లకు ఆగస్టు 31 రాత్రి 8నుంచి నుంచి, ధర్మశాల, లఖ్​నవూ, ముంబయిలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 1 రాత్రి 8నుంచి నుంచి, బెంగళూరు, కోల్‌కతాలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 2 రాత్రి 8నుంచి నుంచి, అహ్మాదాబాద్​లో జరిగే టీమ్​ఇండియా మ్యాచ్​కు సెప్టెంబర్ 3​ రాత్రి 8నుంచి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.
  • సెమీఫైనల్, ఫైనల్‌కు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్‌ 15 రాత్రి 8 నుంచి అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ విడుదల చేయనుంది. మాస్టర్ కార్డ్ ఉన్నవారికి సెప్టెంబర్​ 14 సాయంత్రం 6 గంటల నుంచే ఉంటాయి.

Ind vs Ire 3rd T20 : వర్షం కారణంగా ఆగిపోయిన మూడో టీ20.. 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం

ICC Mens Ranking : కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్​ సాధించిన గిల్.. సూర్య అగ్రస్థానం పదిలం.. కోహ్లీ, రోహిత్ ర్యాంకు ఎంతంటే?​ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.