ETV Bharat / sports

మహిళల ప్రీమియర్ లీగ్​కు బీసీసీఐ సన్నాహాలు- WPL 2024 వేలం అప్పుడే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 4:43 PM IST

Updated : Nov 24, 2023, 7:30 PM IST

Womens Premier League 2024 Auction Date : మహిళల ప్రీమియర్ లీగ్​ 2024 సీజన్​కు ఎర్పాట్లు చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ. ఈ మేరకు ముంబయి వేదికగా డిసెంబర్​లో ఈ ఎడిషన్​కు సంబంధించి వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Womens Premier League 2024 Auction Date
Womens Premier League 2024 Auction Date

Womens Premier League 2024 Auction Date : వచ్చే ఏడాది జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్​ 2024 సీజన్​కు బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 9న ముంబయి వేదికగా ఈ ఎడిషన్​కు సంబంధించి వేలం నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ తెలిపింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి విండోలో ఈ లీగ్​ జరిగే అవకాశం ఉంది.

అయితే వేలం నేపథ్యంలో గుజరాత్​ టైటాన్స్ జట్టు 11 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. దిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత మంది ప్లేయర్లను విడుదల చేసింది. అలా ఐదు టీమ్​లు మొత్తం 29 మందిని రిలీజ్ చేశాడు. ఇక ఇప్పటికే డబ్ల్యూపీఎల్​లో భాగమైన 60 మంది ఓవర్​సీస్​ ప్లేయర్లలో 21 మందిని ఐదు ఫ్రాంచైజీలు రిటైన్ చేశాయి. ఇక ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను (9 మంది విదేశీ క్రికెటర్లు) దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి.

ఫ్రాంచైజీపర్స్​ వాల్యూఅందుబాటులో ఉన్న స్లాట్స్‌
దిల్లీ క్యాపిటల్స్‌ రూ.2.25 కోట్లు3
గుజరాత్‌ జెయింట్స్‌రూ.5.95 కోట్లు10
ముంబై ఇండియన్స్‌ రూ.2.1 కోట్లు5
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరురూ.3.35 కోట్లు7
యూపీ వారియర్స్‌ రూ.4 కోట్లు5

WPL 2024 Auction : గతేడాది జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన కళ్లు చెదిరే ధరకు ఎంపికైంది. ఆమెను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఆర్​సీబీ జట్టులోకి తీసుకుంది. దీంతో డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌లో అత్యధిక ధరకు ఎంపికైన మహిళా క్రికెటర్‌గా తొలి స్థానంలో నిలిచింది మంధాన. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆష్లీ గార్డనర్​ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, నాట్​ స్కివర్​ను రూ. 3.20 కోట్లకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ఇక భారత ప్లేయర్లు దీప్తి శర్మ (రూ. 2.60 కోట్లు - యూపీ వారియర్స్), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు - దిల్లీ క్యాపిటల్స్) అత్యధిక ధర పలికిన జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్‌ కిషన్‌

వరల్డ్​ కప్​ ట్రోఫీకి అవమానం- మిచెల్​ మార్ష్​పై కేసు నమోదు- జీవితకాల నిషేధం!

Last Updated : Nov 24, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.