ETV Bharat / sports

రోహిత్ సక్సెస్ వెనుక రవిశాస్త్రి.. సవాల్​ చేసి మరీ!

author img

By

Published : Aug 23, 2021, 5:31 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్​తో పాటు సుదీర్ఘ ఫార్మాట్​లో నిలకడగా రాణిస్తున్నాడు ఓపెనర్​ రోహిత్​ శర్మ (Rohit Sharma). అయితే అతడి విజయం వెనుక ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి (Ravi Shastri) పాత్ర ఉందని మీకు తెలుసా! అదేలా అనుకుంటున్నారా?

Rohit Sharma
రోహిత్ శర్మ

నిలకడైన ప్రదర్శనలతో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా మారాడు ఓపెనర్​ రోహిత్​ శర్మ (Rohit Sharma). తనదైన బ్యాటింగ్​తో అభిమానుల్లో 'హిట్​మ్యాన్'​గా పేరు సంపాదించాడు. పవర్​ హిట్టింగ్, ఫుల్​షాట్లు, క్రీజులో ఎక్కువసేపు ఉండగల సామర్థ్యం.. ఇవన్నీ రోహిత్​ను అభిమానుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే సుదీర్ఘ ఫార్మాట్​లో రోహిత్ బ్యాటింగ్​ స్థిరత్వం వెనక ప్రస్తుత టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి (Ravi Shastri) పాత్ర ఉందని మీకు తెలుసా!

2013కు ముందు రోహిత్​ మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగేవాడు. నిలకడలేమితో ఒకానొక సమయంలో జట్టులో చోటే ప్రశ్నార్ధకమైంది. కోహ్లీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్​లోకి వచ్చినప్పటికీ అతడిలా పరుగులు సాధించడానికి హిట్​మ్యాన్​ ఇబ్బందిపడేవాడు. ఈ విషయాన్ని గమనించిన నాటి సారథి ధోనీ.. రోహిత్​ను ఓపెనర్​గా ప్రమోట్​ చేశాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలా పరిమిత ఓవర్ల సిరీస్​లో రోహిత్​ ఓపెనర్​గా (Rohit Sharma) విజయవంతమయ్యాడు. కానీ, టెస్టుల్లో మిడిలార్డర్​లోనే బ్యాటింగ్​కు దిగేవాడు. 2019లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్​లో ఓపెనర్​గా బరిలోకి దిగాడు ఈ కుడి చేతి వాటం బ్యాట్స్​మన్. ఆ తర్వాత ఒకే నెలలో మూడు సెంచరీలు బాది తానెంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు.

రవిశాస్త్రి పాత్ర..

టెస్టుల్లో రోహిత్​ ఓపెనర్ అవతారమెత్తడానికి కోచ్​ రవిశాస్త్రియే ప్రధాన కారణమట. 2019లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్​లో ఇండియా ఇన్నింగ్స్​ను హిట్​మ్యాన్​ ప్రారంభిస్తాడని శాస్త్రి తెలిపాడు. ఈ క్రమంలోనే ఓపెనర్​గా రోహిత్​ విజయవంతం కాకపోతే కోచ్​గా తాను విఫలమైనట్లేనని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సవాలుగా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ అంశాలన్నీ బోరియా మజుందార్, కుషాన్​ సర్కార్​ కలిసి రాసిన 'మిషన్​ డామినేషన్- యాన్​ అన్​ఫినిష్​డ్​ క్వెస్ట్'​ (Mission Domination: An Unfinished Quest) అనే పుస్తకంలో పొందుపరిచారు.

శాస్త్రి చెప్పినట్లే రోహిత్​ సఫలమయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో హిట్​మ్యాన్​ కీలకంగా మారాడు. స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​లో జరుగుతోన్న ఐదు మ్యాచ్​ల సిరీస్​లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఇదీ చదవండి: 'కోహ్లీ కూడా మనిషే.. ప్రతిసారి సెంచరీ కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.