ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్.. భారత్​- వెస్టిండీస్ సిరీస్​ వేదికల్లో మార్పు!

author img

By

Published : Jan 7, 2022, 9:21 AM IST

West Indies Tour Of India: దేశంలో కొవిడ్ వ్యాప్తి కారణంగా వచ్చేనెలలో వెస్టిండీస్​తో జరిగే సిరీస్​ను ఒకటి లేదా West Indies Tour Of India: రెండు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కరోనా కారణంగా ఇప్పటికే రంజీ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీను వాయిదా వేసింది బీసీసీఐ.

India-WI series
భారత్​- వెస్టిండీస్ సిరీస్

West Indies Tour Of India: దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య గణనీయంగా పెరగటం వల్ల ఇప్పటికే రంజీ ట్రోఫీ, ​సీకే నాయుడు ట్రోఫీతోపాటు సీనియర్ ఉమెన్స్ టీ 20లీగ్​ను వాయిదా వేసింది బీసీసీఐ. అయితే తాజాగా భారత్-వెస్టిండీస్​​ సిరీస్​పైనా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విండీస్​తో జరిగే మ్యాచ్​లను ఒకటి లేదా రెండు వేదికల్లోనే నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

" ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఫిబ్రవరిలో కేసులు ఉచ్ఛదశకు చేరుకునే అవకాశం ఉంది. ఆరు వేదికల్లో మ్యాచ్​లను నిర్వహించడం పీడకలే" అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.

వెస్టిండీస్ జట్టు ఫిబ్రవరి మొదటివారంలో భారత్​లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.

అహ్మదాబాద్, జైపుర్, కోల్​కతాలో మూడు వన్డేలు జరగనుండగా.. కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో మూడు టీ20లు జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్​లకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించరని సమాచారం.

టీమ్ఇండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. జనవరి 23న ఈ పర్యటన ముగుస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్​తో సిరీస్ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: SA vs IND: 'కోహ్లీ కోలుకున్నాడు.. మూడో టెస్టుకు రెడీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.