ETV Bharat / sports

Hardik pandya: ప్రపంచకప్​లో కచ్చితంగా బౌలింగ్​ చేస్తా!

author img

By

Published : Jun 12, 2021, 10:07 AM IST

ప్రస్తుతం తన దృష్టంతా టీ20 ప్రపంచకప్(T20 Worldcup)​ మీదే ఉందని అన్నాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య(Hardik pandya). ఈ మెగాఈవెంట్​లో పూర్తిస్థాయిలో బౌలింగ్​ చేసేలా సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.

hardik
హార్దిక్​

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య(Hardik pandya) పూర్తిస్థాయిలో బౌలింగ్ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన నేపథ్యంలో శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హార్దిక్ ఈ విషయమై స్పందించాడు. టీ20 ప్రపంచకప్(T20 Worldcup)​ నాటికి పూర్తిస్థాయిలో ఫిట్​నెస్​ సాధించి బంతులు విసురుతానని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఈ మెగా ఈవెంట్​పైనే ఉందని, అందుకోసం శ్రమిస్తున్నట్లు తెలిపాడు.

"టీ20 ప్రపంచకప్​లోని అన్ని మ్యాచ్​ల్లో బౌలింగ్​ చేస్తాను. స్మార్ట్​గా వర్క్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. కచ్చితంగా బంతులు విసురుతానని భావిస్తున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ఈ మెగాఈవెంట్​ పైనే. నా సర్జరీ తర్వాత కూడా నేనెప్పుడు బౌలింగ్​ కసరత్తు​ మానలేదు. నా బౌలింగ్​.. ఫిట్​నెస్​పై ఆధారపడి ఉంటుంది. ఎంత బలంగా తయారవుతే అంత ఎక్కువ ఫలితం ఇవ్వగలను. నేనెప్పుడూ 50శాతం సామర్థ్యంతో ఆడాలనుకోలేదు. 100శాతం సామర్థ్యంలో బరిలో దిగుతా" అని పాండ్య వివరించాడు.

2018లో ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ సందర్భంగా హార్దిక్ వెన్నుకు గాయమైంది. దీంతో ఏడాది పాటు ఆటకు దూరమై, 2019 అక్టోబరులో సర్జరీ చేయించుకున్నాడు. ఈ వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం అతడు భారత జట్టులోకి వచ్చినా బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. తప్పని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మాత్రం నాలుగు ఓవర్లు వేశాడు. టీ20 ప్రపంచకప్​ భారత్​ వేదికగా అక్టోబర్​-నవంబరు మధ్యలో జరగాలి. అయితే కరోనా కారణంగా ఈ మెగాఈవెంట్​ ఇక్కడ నిర్వహిస్తారో లేదో స్పష్టత లేదు. ఈ నెల చివర్లో లేదా జులై తొలి వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇదీ చూడండి: ఆ విషయంలో నా కుటుంబానిది కీలకపాత్ర: హార్దిక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.