ETV Bharat / sports

T20 World Cup: హార్దిక్​ భుజానికి గాయం.. ఇక కష్టమే!

author img

By

Published : Oct 25, 2021, 6:04 AM IST

Updated : Oct 25, 2021, 7:18 AM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​​లో పాకిస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకొని తదుపరి మ్యాచుల్లో ఆడినా.. అతడు బౌలింగ్ చేయడం అనుమానమే అనే విశ్లేషణలు వస్తున్నాయి.

hardik
హార్దిక్ పాండ్య

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య కుడి భుజానికి గాయమైంది. టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో(ind vs pak) ఆదివారం జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్​ చేస్తుండగా పాండ్య భుజానికి బంతి తగిలింది. దీంతో పాక్ ఇన్నింగ్స్​లో హార్దిక్ ఫీల్డింగ్​కు రాలేదు. అతడి బదులు ఇషన్​ కిషన్ ఫీల్డింగ్ చేశారు. ముందు జాగ్రత్తగా పాండ్యను స్కానింగ్​ కోసం పంపించినట్లు బీసీసీఐ వెల్లడించింది.

బౌలింగ్ అనుమానమే..

మ్యాచ్​కు ముందు తన బౌలింగ్​ ఫామ్​పై స్పందించిన హార్దిక్.. రానున్న మ్యాచుల్లో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటానని వెల్లడించాడు. అయితే ప్రస్తుత గాయం కారణంగా అతడు బంతి చేతపట్టడం అనుమానంగా మారింది.

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) హార్దిక్​ పాండ్య(Hardik Pandya News) బౌలింగ్​ చేస్తాడా? లేదా అనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్య కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్ చేస్తే బాగుంటుందని టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) శనివారం అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్​ ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఆడిన హార్దిక్​ ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ వార్మప్​ మ్యాచ్​ల్లోనూ హార్దిక్ బౌలింగ్ చేయలేదు.

ఓడిన టీమ్​ఇండియా..

ఆదివారం జరిగిన మ్యాచ్​లో పాక్​ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది టీమ్​ఇండియా. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహమ్మద్‌ రిజ్వాన్ (79*), కెప్టెన్ బాబర్ అజామ్ (68*) భారీ భాగస్వామ్యంతో పాక్‌కు విజయాన్ని అందించారు. భారత బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్‌ దక్కలేదు. టీమ్​ఇండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్‌ బ్యాటర్లు నింపాదిగా తమపని చేసుకుని వెళ్లిపోయారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్నిరంగాల్లో రాణించిన పాకిస్థాన్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌పై పాకిస్థాన్‌ తొలి విజయం సాధించడం విశేషం.

ఇదీ చదవండి: T20 worldcup: తడబడిన టీమ్​ఇండియా.. పాకిస్థాన్​ లక్ష్యం 152

Last Updated :Oct 25, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.