ETV Bharat / sports

Virat Kohli Break: 'వన్డే సిరీస్​కు విశ్రాంతి కావాలని కోహ్లీ కోరలేదు'

author img

By

Published : Dec 14, 2021, 5:03 PM IST

Virat Kohli Break: టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీ, టీ20, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య వివాదం ముదురుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్​కు కోహ్లీ దూరమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై బీసీసీఐ అధికారి స్పష్టతనిచ్చారు.

virat kohli
విరాట్ కోహ్లీ

Virat Kohli Break: టీమ్​ఇండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.. భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భాగంగా వన్డే సిరీస్​కు దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ఊహాగానాలపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. వన్డే సిరీస్​ నుంచి విశ్రాంతి కావాలని విరాట్​ అధికారికంగా బీసీసీఐని కోరలేదని తెలిపారు.

"వన్డే సిరీస్​ నుంచి తప్పుకొంటున్నట్లు విరాట్​ కోహ్లీ అధికారికంగా చెప్పలేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీకి లేదా సెక్రటరీ జై షాకు సమాచారం అందించలేదు. టెస్టు సిరీస్​ అనంతరం అతడు గాయం కారణంగా లేదా వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్​కు దూరమైతే అది భిన్నమైన అంశం."

-బీసీసీఐ అధికారి.

ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం విరాట్ జనవరి 19, 21, 23న జరగనున్న వన్డేల్లో ఆడతాడని ఆ అధికారి చెప్పుకొచ్చారు. క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో సహా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

"దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కూడా భారత క్రికెటర్లు బయోబబుల్​లో ఉండాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టు భారత్​లో పర్యటించనున్న నేపథ్యంలో క్రికెటర్లు మూడు వారాల పాటు బబుల్​లో ఉండనున్నారు" అని అధికారి చెప్పారు.

డిసెంబర్ 26 నుంచి భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. జనవరి 15న కేప్​టౌన్​ వేదికగా చివరి టెస్టు జరగనుంది. ఈ టెస్టు సిరీస్​కు విరాట్​ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. అనంతరం.. జనవరి 19 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభమవుతుంది. అయితే.. ప్రాక్టీస్​ సెషన్​లో గాయమైన కారణంగా వైస్​ కెప్టెన్​ రోహిత్ శర్మ టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు.

ఇదీ చదవండి:

IND vs SA Series: వన్డే సిరీస్​కు కోహ్లీ దూరం.. ఫ్యాన్స్​లో అనుమానాలు!

IND vs SA Series: సఫారీ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు వీరే!

'రోహిత్ విరాట్ వివాదం.. బ్రేక్​ తీసుకున్న సమయమే తప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.