ETV Bharat / sports

Virat Kohli: 'కోహ్లీ.. ఫామ్​లోకి రావాలంటే అక్కడికి రా'

author img

By

Published : Mar 16, 2022, 11:08 AM IST

Virat Kohli: భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్​ శర్మ. అకాడమీకి వచ్చి తన బేసిక్స్​ను తిరిగి నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు.

Virat Kohli
విరాట్​ కోహ్లీ

Virat Kohli: విరాట్ కోహ్లీ అకాడమీకి వచ్చి తన బేసిక్స్​ను తిరిగి నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు చిన్ననాటి కోచ్​​ రాజ్​కుమార్​ శర్మ. 'ఖేల్​నీతి' పోడ్​కాస్ట్​లో మాట్లాడిన అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అకాడమీకి వచ్చి బేసిక్స్​పై సాధన చేసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్​లో ఎలా రాణించాడో వివరించాడు.

కోహ్లీ తన బేసిక్స్​ను తిరిగి నేర్చుకోవాలి. అతడు తిరిగి అకాడమికి రావాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ విషయంపై ఆలోచిస్తున్నాను త్వరలో కోహ్లీతో మాట్లాడుతాను. కోహ్లీకి అకాడమీలో ఉన్నప్పటి విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలి. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ, దురదృష్టవశాత్తు అతడు అతి జాగ్రత్తగా ఆడుతున్నాడు. కెరీర్​ ప్రారంభంలోలాగా స్వేచ్ఛగా ఆడితే త్వరలోనే ఉన్నత స్థానాన్ని తిరిగి చేరుకుంటాడు. ఇలాంటి వికెట్లపై పంత్​, అయ్యర్​లాగా మరికొన్ని అవకాశాలు తీసుకోవాలి.

-రాజ్​కుమార్​ శర్మ, విరాట్​ కోహ్లీ చిన్ననాటి కోచ్​

విరాట్​ కోహ్లీ 71 సెంచరీ చేస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్​ టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్సుల్లోనూ వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇదీ చదవండి:భారత జట్టుపై కైఫ్​ ట్వీట్​.. కోహ్లీ ఫ్యాన్స్​ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.