ETV Bharat / sports

'రింకు నుంచే నేర్చుకుంటున్నా - బంతి అలా వస్తే బాదేయడమే': తిలక్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 6:41 AM IST

Updated : Nov 26, 2023, 8:17 AM IST

Tilak Varma T20 : టీ20ల్లో మ్యాచ్ ఫినిషింగ్ ఎలా చేయాలనేది రింకూ సింగ్​ నుంచే నేర్చుకుంటున్నానని, టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు.

Tilak Varma T20
Tilak Varma T20

Tilak Varma T20 : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ.. తక్కువ కాలంలోనే టీ20ల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ.. మాజీల ప్రశంసంల సైతం అందుకుంటున్నాడు. అయితే ఉత్కంఠ భరిత టీ20​ల్లో మ్యాచ్​ ఎలా ముగించాలో, తన తోటి ఆటగాడు రింకూ సింగ్ నుంచి నేర్చుకుంటున్నానని తాజాగా తిలక్ అన్నాడు.

"మ్యాచ్​ ఫినిషింగ్ ఎలా చేయాలో రింకు నుంచి నేర్చుకుంటున్నా. నెక్ట్స్​ మ్యాచ్​ల్లో నేను అద్భుతంగా ముగిస్తానని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. టీమ్​లో నాకు ఉన్న పాత్రను సమర్థంగా పోషిస్తాను. నేను ఆడగలిగే చోట బంతి పడితే కచ్చితంగా భారీ షాట్ ఆడేస్తా. బంతి అనుకూలంగా రాకపోతే.. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తా" అని తిలక్ అన్నాడు.

2022లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఐపీఎల్​ అరంగేట్రం చేసిన తిలక్.. ఏడాదిలోనే అంతర్జాతీయ టీ20, వన్డేల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు. అతడు రీసెంట్​గా జరిగిన 2023 ఆసియా కప్​తో వన్డేల్లో కెరీర్​ ప్రారంభించాడు. ఇక టీ20ల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్​ల్లో 249 పరుగులు బాదాడు. అందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి.

Ind vs Aus 2nd T20 : ఆస్ట్రేలియాతో విశాఖ వేదికగా ఇటీవల జరిగిన తొలి టీ20లో తిలక్ విఫలమైన విషయం తెలిసిందే. ఆయితే ఈ సిరీస్​లో భాగంగా ఆదివారం (నవంబర్ 26) కేరళ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​కు ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. తొలి టీ20లో గెలిచి ఊపుమీదున్న భారత్.. రెండో మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​లో ఆధిక్యం సంపాదించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరోవైపు తొలి టీ-20లో ఆసీస్​.. గెలుపు అంచులదాకా వెళ్లీ బోల్తా కొట్టింది. ఈ మ్యాచ్​తోనైనా సిరీస్‌లో బోణీ కొట్టాలని ఆసీస్ తహతహలాడుతోంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన జోష్‌ ఇంగ్లిస్‌తోపాటు సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అవకాశం ఉంది. స్టార్‌ ఆటగాళ్లు మాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నా.. ఆసీస్‌ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది.

రెండో మ్యాచ్​లోనూ సత్తా చాటాలని యువ భారత్​- బోణీ కోసం అసీస్​ ప్రయత్నం!

టీ20ల్లో సూర్యనే కింగ్ - పొట్టి ఫార్మాట్​లో టాప్ 5 స్ట్రైక్ రేట్స్​ ఇవే!

Last Updated : Nov 26, 2023, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.