ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో సెమీస్​ మ్యాచ్​.. ఆ ప్లాన్​ అమలు చేస్తే విజయం మాదే: రోహిత్​

author img

By

Published : Nov 7, 2022, 2:40 PM IST

జింబాబ్వేపై గెలిచి సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా.. నవంబరు 10న ఇంగ్లాండ్​తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సన్నద్ధతపై కెప్టెన్‌ రోహిత్ శర్మ కీలక విషయాలను వెల్లడించాడు.

Rohith sharma t20 worldcup semi final
ఇంగ్లాండ్​తో సెమీస్ మ్యాచ్​పై రోహిత్​

మెగా టోర్నీ సూపర్ - 12 దశలో భారత్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో నవంబర్ 10న తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సన్నద్ధతపై కెప్టెన్‌ రోహిత్ శర్మ కీలక విషయాలను వెల్లడించాడు.

"ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ చాలా కీలకం. అయితే అంతకుముందు పిచ్‌ పరిస్థితులకు త్వరగా సర్దుబాటు కావడం మరీ ముఖ్యం. అడిలైడ్‌ వేదికగా ఒక మ్యాచ్‌ ఆడటం మాకు సానుకూలాంశం. అయితే ఇంగ్లాండ్‌తో సవాల్‌ బాగుంటుందని భావిస్తున్నా. వారు చాలా బాగా ఆడి ఇక్కడకు వచ్చారు. అయితే ఇక్కడ మేం ఏం సాధించామనేది మరిచిపోం. జట్టుకు అవసరమైన విధంగా వ్యక్తిగత ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. కచ్చితంగా ఇదొక హై ఓల్టేజీ గేమ్‌ అవుతుంది. మేం మంచిగా ఆడితే ఆటోమేటిక్‌గా విజయం వరించే అవకాశం ఉంది. అయితే అందుకు తగ్గట్లుగానే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి.. మైదానంలో అమలు చేయాల్సి ఉంటుంది" అని రోహిత్ వివరించాడు.

డీకేను తప్పించడంపై జహీర్‌.. వరుసగా అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో దినేశ్‌ కార్తిక్‌ విఫలం కావడంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. ఈ క్రమంలో డీకేను తప్పించడంపై జహీర్ స్పందిస్తూ.. "దినేశ్ కార్తిక్‌పై టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ చాలా ఆశలు పెట్టుకొంది. అయితే డీకే మాత్రం తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఫినిషర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. దీంతో రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఒక్క మార్పు సుదీర్ఘ కాలానికి దారి తీసే ఛాన్స్‌ లేకపోలేదు’’ అని జహీర్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: అత్యాచార కేసులో క్రికెటర్ అరెస్ట్​.. జాతీయ జట్టు నుంచి కూడా సస్పెండ్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.