ETV Bharat / sports

T20 world cup 2021: అవసరమైతే జట్టు నుంచి తప్పుకొంటా: కెప్టెన్ మోర్గాన్

author img

By

Published : Oct 20, 2021, 8:10 AM IST

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్ 2021

జట్టుకు లాభిస్తుందని అనుకుంటే.. టీ20 ప్రపంచకప్ (T20 world cup 2021) నుంచి తప్పుకొంటానని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అన్నాడు. టీమ్​ఇండియాతో వార్మప్ మ్యాచ్​లో ఆడని నేపథ్యంలో, అతడిని ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను తప్పుకొంటే జట్టుకు ప్రయోజనం ఉందని అనిపిస్తే(T20 world cup 2021) ఆ పని చేస్తానని ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(eoin morgan t20 world cup) అన్నాడు. టీ20 ప్రపంచకప్​ను ఇంగ్లాండ్ సాధిస్తుందనుకుంటే జట్టుకు అడ్డుగా ఉండాలనుకోట్లేదని చెప్పాడు. టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు ఈ మేరకు స్పందించాడు.

"నేను పరుగులు​ చేయడంలో వెనకబడ్డాను. ఫామ్​ కోల్పోయిన ప్రతిసారి బయటపడందే నేను ఈ స్థాయిలో ఉండను. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతాను. టీమ్ కష్టసమయంలో ఉన్నప్పుడే బ్యాటింగ్ చేయడం నాకు ఇష్టం. నా కెప్టెన్సీ బాగుంది. అవసరమైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. టీమ్​కు ప్రయోజనం అనుకుంటే తప్పకుండా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటాను"

-మోర్గాన్​, ఇంగ్లాండ్ కెప్టెన్​

ఐపీఎల్​-2021లోనూ(ipl 2021) మోర్గాన్​, కోల్​కతా జట్టుకు సారథిగా ఉన్నాడు. తన అనుభవంతో టీమ్​ను ఫైనల్​ వరకు తీసుకొచ్చాడు. కానీ రన్నరప్​గా నిలిపాడు. కెప్టెన్​గా సక్సెస్​ అయినప్పటికీ వ్యక్తిగతంగా బ్యాటింగ్​లో విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

యూఏఈలోని రెండోదశ ఐపీఎల్​లో ఏడు మ్యాచ్​లు ఆడిన ఈ ఇంగ్లాండ్ క్రికెటర్(eoin morgan ipl 2021 runs).. కేవలం 82 పరుగులే​చేశాడు. 35 టీ20​ల్లో అతని రన్​రేట్​ కేవలం 16.63గా ఉంది. అటు.. టీమ్​ఇండియాతో వార్మప్ మ్యాచ్​కూ దూరంగా ఉన్నాడు.

ఇదీ చదవండి: 'భువనేశ్వర్ స్థానంలో శార్దూల్​కు అవకాశం ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.