ETV Bharat / sports

WTC Final: టీమ్ఇండియా ప్రాక్టీస్​.. కోహ్లీ వినూత్న ట్వీట్

author img

By

Published : Jun 9, 2021, 9:18 PM IST

ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు ఇన్ని రోజులు కఠిన క్వారంటైన్​లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మైదానంలో ప్రాక్టీస్​కు దిగుతున్నారు. నిర్బంధంలో ఉండి ఇబ్బంది పడిన ఆటగాళ్లు ఒక్కసారిగా బయటి ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని కోహ్లీ ట్విట్టర్​లో షేర్​ చేశాడు. 'సూర్యుడు చిరునవ్వులను తీసుకొస్తాడు' అనే క్యాప్షన్​ను దాని కింద రాసుకొచ్చాడు.

virat kohli, indian captain
విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం ఇంగ్లాండ్​లో ఉంది టీమ్​ఇండియా. మూడు రోజుల కఠిన క్వారంటైన్​ అనంతరం ఇప్పుడిప్పుడే మైదానంలోకి అడుగుపెడుతున్నారు ఆటగాళ్లు. ఇందుకు సంబంధించి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. మైదానంలో రన్నింగ్ చేసిన అనంతరం సూర్యరశ్మి పడిన ఫొటోను పెట్టాడు. 'సూర్యుడు చిరునవ్వులను తీసుకొస్తాడు' అనే క్యాప్షన్​ దాని కింద రాశాడు.

భారత ఆటగాళ్లు పుజారా, శుభ్​మన్​ గిల్​, కోహ్లీ ఇందులో ఉన్నారు. మే 3న ఇంగ్లాండ్​లో అడుగుపెట్టిన క్రికెటర్లు.. ఇప్పుడిప్పుడే తక్కువ మందితో శిక్షణను కొనసాగిస్తున్నారు. క్రమక్రమంగా జట్టు మొత్తం గ్రౌండ్​లో ప్రాక్టీస్​కు దిగనున్నారు.

ఇదీ చదవండి: Rohit: బ్యాటింగ్​లోనే కాదు.. మతిమరుపులోనూ ఫస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.