ETV Bharat / sports

ఈ బుడ్డోడు ఇప్పుడు భారత స్టార్​ క్రికెటర్​.. క్రీజులో ఉంటే బౌలర్లకు చుక్కలే!

author img

By

Published : Nov 7, 2022, 11:23 AM IST

Updated : Nov 7, 2022, 11:42 AM IST

పైన ఫొటోలో ఉన్న ఈ చిన్నోడు ప్రస్తుతం టీమ్​ఇండియాలో స్టార్ క్రికెటర్​. టీ20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్​లోనూ వినూత్న షాట్లు ఆడి క్రికెట్​ లవర్స్​ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టగలరా?

surya kumar yadav child photo
సూర్యకుమార్​ యాదవ్ ఫొటోలు

ప్రస్తుతం టీమ్​ఇండియాలో ఎవరు అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నారంటే.. ప్రతి క్రీడాభిమానికి టక్కున గుర్తొచ్చే పేరు అతడిదే. జట్టుకు ఎంపికైనప్పటి నుంచి అదిరిపోయే షాట్లు బాదుతూ.. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. అతడు క్రీజులో ఉంటే.. బంతులు వేయడానికి బౌలర్లు చుక్కలే అనడంలో ఎలాంటి అతిశయయోక్తి లేదు. ఈ ప్రపంచకప్‌లో అతడు విశ్వరూపాన్ని క్రికెట్‌ ప్రపంచం చూస్తోంది. బంతి ఎలాంటిదన్నది చూడకుండా.. మైదానం నలుమూలలా తన మార్కు వినూత్న షాట్లతో పరుగులు సాధిస్తున్నాడు. అతడు మరెవరో కాదు పైన ఫొటోలు ఉన్న చిన్నవాడే. ఇంతకీ ఎవరో గుర్తుపట్టగాలిగారా? అతడే సూర్యకుమార్ యాదవ్​.

ప్రస్తుతం క్రికెట్​లో ఏబీ డివిలియర్స్‌ క్రికెట్‌కు దూరమయ్యాడని అభిమానులేమీ బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే అతడి లాగే 360 డిగ్రీల కోణంలో ఆడుతూ.. ఈ తరం క్రికెట్‌ అభిమానులకు అంతకుమించిన వినోదాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ఎన్నోసార్లు తన సత్తాను చాటిచెప్పిన సూర్య.. అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా అవకాశం అందుకున్నప్పటికీ పతాక స్థాయి విధ్వంసంతో దూసుకెళ్తున్నాడు.

తాజా ప్రపంచకప్‌లోనూ తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపిస్తూ.. బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇక నిన్న జింబాబ్వేపై జరిగిన సూపర్‌ 12 చివరి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో వీరవిహారం చేస్తూ కేవలం 25 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కాగా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆడిన ర్యాంప్‌ షాట్‌ గురించి మ్యాచ్‌ అనంతరం మాజీ కోచ్‌ రవిశాస్త్రి అడగ్గా.. అలాంటి స్ట్రోక్స్‌ ఆడేందుకు ఎలా సిద్ధమవుతాననేది ఈ భారీ హిట్టర్‌ వివరించాడు. 'ఆ సమయంలో బౌలర్‌ ఎలా బౌలింగ్‌ చేయబోతున్నాడో అర్థం చేసుకోవాలి. కొంచెం ముందుగానే చిన్న అంచనాతో ఉండాలి. రబ్బర్‌ బాల్‌ క్రికెట్‌ ఆడేటప్పుడు ఇలాంటి షాట్లు ఎన్నో ప్రాక్టీస్‌ చేశాను. ఆ సమయంలో బౌలర్‌ ఏం ఆలోచిస్తున్నాడో.. మీరు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉండాలి' అని సూర్య వివరించాడు.

ఇక ఆ షాట్‌ ఆడటానికి మణికట్టు బలం ఎంత అవసరమని శాస్త్రి అడగ్గా.. 'మన వెనుకున్న బౌండరీ ఎంత పొడవో మీకు తెలిసి ఉండాలి. నేనైతే అది కేవలం 60-65 మీటర్లు మాత్రమే అని భావిస్తా. బంతి వేగానికి సరైన టైమింగ్‌ను జోడించి ప్రయత్నిస్తాను. బంతిని బౌండరీకి తరలిస్తాను' అని సూర్య తెలిపాడు. ఇక ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమ్‌ ఇండియా.. గురువారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

surya kumar yadav
సూర్యకుమార్ యాదవ్

ఇదీ చదవండి: T20 World Cup: విజృంభించిన బౌలర్లు.. టీమ్​ఇండియా సూపర్​ విక్టరీ

హయ్యెస్ట్ ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 క్రికెటర్స్ వీరే

Last Updated :Nov 7, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.