ETV Bharat / sports

T20 World Cup: విజృంభించిన బౌలర్లు.. టీమ్​ఇండియా సూపర్​ విక్టరీ

author img

By

Published : Nov 6, 2022, 4:51 PM IST

Updated : Nov 6, 2022, 4:58 PM IST

Etv Bharat
Etv Bharat

T20 World Cup Ind VS Zim: టీ20 ప్రపంచ కప్​లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా 71 పరుగుల తేడాతో గెలిచింది.

T20 World Cup Ind VS Zim: టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై టీమ్‌ఇండియా 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.2 ఓవర్లకు 115 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో సికందర్‌ రజా (34*), బర్ల్‌(35) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, షమీ, హార్దిక్‌ 2 వికెట్ల చొప్పున తీయగా.. భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ నెల 10న సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా తలపడనుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్ (3) విఫలం కాగా.. విరాట్ కోహ్లీ 26, హార్దిక్ పాండ్య 18, రోహిత్ శర్మ 15 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లు సీన్‌ విలియమ్స్ 2.. ఎన్‌గరవ, ముజరబని, సికందర్ రజా తలో వికెట్‌ తీశారు. సూర్యకుమార్‌ (59*) దూకుడుగా ఆడి హాఫ్‌సెంచరీతో పాటు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Last Updated :Nov 6, 2022, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.