ETV Bharat / sports

శుభమన్​ కోసమే ఎక్కువ మంది సెర్చ్ చేశారట- గిల్​కు 2023 బాగా కలిసొచ్చిందిగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 10:54 PM IST

Shubman Gill Most Searched On Google
Shubman Gill Most Searched On Google

Shubman Gill Most Searched On Google : 2023లో అత్యధిక మంది గూగుల్​లో సెర్చ్​ చేసిన భారత అథ్లెట్లలో శుభ్​మన్ గిల్​ టాప్​లో నిలిచాడు. ఓవరాల్​గా గిల్​ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Shubman Gill Most Searched On Google : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్​ శుభ్​మన్ గిల్ 2023లో గూగుల్​లో అత్యధిక మంది సెర్చ్​ చేసిన భారత అథ్లెట్​గా నిలిచాడు. ఈ ఏడాది గూగుల్​లో దేశంలో ట్రెండ్ అయిన వ్యక్తుల జాబితాను 'గూగుల్ ఇండియా' సోమవారం వెల్లడించింది. ఈ లిస్ట్​లో గిల్​ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, మహ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్​వెల్, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్ నిలిచారు.

అయితే 2023 సంవత్సరం గిల్​కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు. దీంతో సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్​ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఐదో బ్యాటర్​గా గిల్​ రికార్డు కొట్టాడు. ఇక రీసెంట్​గా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లోనూ గిల్ ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం గిల్ 826 రేటింగ్స్​తో టాప్​ పొజిషన్​లో కొనసాగుతున్నాడు. మరోవైపు 2023 ఆసియా కప్​, 2023 వన్డే వరల్డ్​కప్​నకూ ఎంపికైన గిల్ ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్​ల్లో తన మార్క్​ చూపించాడు.

Shubman Gill Captain : 2024 ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​ జట్టు కెప్టెన్​గా శుభ్​మన్ గిల్ ఎంపికయ్యాడు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్​ జట్టుకి ట్రేడవడం వల్ల గిల్​కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది గుజరాత్​ యాజమాన్యం. దీంతో బ్యాటర్​ నుంచి గిల్​కు కెప్టెన్​గా ప్రమోషన్ వచ్చినట్లైంది.

Shubman Gill IPL Stats : గిల్ తన ఐపీఎల్​ కెరీర్​లో 33 ఇన్నింగ్స్​ల్లోనే 1373 పరుగులు 47.34 చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత సీజన్​లోనే 17 మ్యాచ్​ల్లో గిల్ 890 పరుగులు బాది.. టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​గా నిలిచాడు. అందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఇక ప్లేఆఫ్స్​లో ముంబయి ఇండియన్స్​పై గిల్ 60 బంతుల్లో 129 పరుగులు బాది గుజరాత్​ గెలుపులో కీలకంగా మారాడు.

'కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి' - గిల్​ కామెంట్స్​ అతడ్ని ఉద్దేశించేనా?

టాప్​ పొజిషన్​కు గిల్ - కెరీర్​లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్​ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.