ETV Bharat / sports

HCA News: అజారుద్దీన్​కు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

author img

By

Published : Oct 28, 2021, 7:02 AM IST

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA News) వివాదంపై తదుపరి విచారణను దీపావళి తర్వాతకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు (Supreme Court News). హెచ్​సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్​కు కీలక ఆదేశం జారీచేసింది.

HCA News
అజారుద్దీన్

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా సంఘం అధ్యక్షుడు (Azharuddin News) మహ్మద్‌ అజహరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ (R Vijayanand HCA) కలిసి ఉమ్మడిగా చెక్కులపై సంతకాలు పెట్టాలని సుప్రీం కోర్టు (Supreme Court News) ఆదేశించింది. విచారణ ముగిసి తీర్పు వెలువడేంత వరకూ ఈ ఆదేశాన్ని పాటించాలని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం హెచ్‌సీఏ (HCA News) దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌-కమ్‌-ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ దీపక్‌ వర్మ నియామకానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

ఇదీ చూడండి: హెచ్‌సీఏ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.