ETV Bharat / sports

Sachin: భారత్ కంటే ముందు సచిన్, పాక్ జట్టులో..

author img

By

Published : Jun 1, 2021, 5:30 PM IST

Sachin Tendulkar played for Pakistan before India
సచిన్

మన దేశ క్రికెట్​లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించిన సచిన్.. తన అరంగేట్రం కంటే ముందు పాకిస్థాన్ తరఫున ఆడాడు. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగిందంటే?

టీమ్​ఇండియాకు ఎన్నో విజయాలు అందించి, లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పిన దిగ్గజ బ్యాట్స్​మన్ సచిన్ తెందూల్కర్. ఇతడు మన దేశం కంటే ముందు దాయాది పాకిస్థాన్​ తరఫున ఆడాడంటే నమ్ముగలరా? అవును మీరు విన్నది నిజమే. 1987లో ఈ సంఘటన జరిగింది.

1987లో భారత్​ పర్యటకు వచ్చిన పాక్.. సిరీస్​కు ముందు ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియంలో ప్రాక్టీసు మ్యాచ్​ ఆడింది. ఇందులో దాయాది జట్టు తరఫున సబ్​స్టిట్యూట్​గా బరిలోకి దిగాడు సచిన్. ఆ తర్వాత రెండేళ్లకు టీమ్​ఇండియా తరఫున టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

Sachin Tendulkar played for Pakistan before India
సచిన్ తెందుల్కర్

కెరీర్​లో మొత్తంగా 200 టెస్టుల్లో 15,921 పరుగులు.. 463 వన్డేల్లో 18,426 పరుగులు.. 78 ఐపీఎల్ మ్యాచ్​ల్లో 2334 పరుగులు చేశాడు సచిన్. అంతర్జాతీయంగా 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్​మన్ సచినే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.