ETV Bharat / sports

Rohit sharma retirement news : 'అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నాను'

author img

By

Published : Aug 6, 2023, 3:19 PM IST

Updated : Aug 6, 2023, 6:40 PM IST

Rohit sharma retirement news : టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ.. తన రిటైర్మెంట్​పై పరోక్షంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశాడు. ఆ వివరాలు..

Rohit sharma retirement news
Rohit sharma retirement news

Rohit sharma retirement news : టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. అయితే అతడు టీ20 సిరీస్​లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో హార్దిక్ పాండ్య.. సారథ్యం వహిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా స్టార్ బ్యాటర్లైనా కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఈ ఫార్మాట్​ లో ఆడట్లేదు. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌ తర్వాత హిట్​ మ్యాన్​ రిటైర్మెంట్​ తీసుకుంటాడనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా అతడు ఓ క్రికెట్​ అకాడమీ ఓపెన్​ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. అక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్​ వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా నిర్వహించనున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరూ ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని అనుకుంటున్నాను. నేను కూడా ఈ మెగా పోరు బరిలోకి దిగాలని అనుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్​తో పొట్టి కప్‌ మెగా టోర్నీలో హిట్ మ్యాన్ ఆడే అవకాశాలూ ఉన్నాయని అభిమానులు సోషల్​మీడియాలో పుల్​గా కామెంట్లు పెడుతున్నారు.

సీనియర్లు లేకుండానే.. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమ్​ఇండియా ఓడిపోవడం గురించి చాలా మంది మరో ఓవర్​గా స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. యంగ్​ ప్లేయర్స్​తో కూడిన టీమ్​.. హార్డ్‌ హిట్టర్లు ఉన్న విండీస్‌ జట్టుతో పోటీపడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, షమీ లేకుండానే వారంతా ఆడారు. కాబట్టి ఈ ఓటమి విషయంలో అంతగా కంగారు పడాల్సిన అవసరమేమీ లేదని నా అభిప్రాయం. టీమ్‌ఇండియా ఆడిన విధానం చాలా బాగుంది. చివర్లో కొన్ని తప్పులు చేయడం వల్లే ఈ ఓటమిని అందుకోవాల్సి వచ్చింది. తప్పకుండా ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని విజయాలను అందుకుంటారు" అని సీనియర్‌ ప్లేయర్​ అభినవ్‌ ముకుంద్‌ పేర్కొన్నాడు.

Rohit Sharma Cricket Academy : అమెరికాకు పయనమైన హిట్​మ్యాన్​.. ఆ ప్లేస్​లో అకాడమీ ఓపెనింగ్​..

Ind Vs WI T20 : టీమ్​ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?

Last Updated : Aug 6, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.