ETV Bharat / sports

Rohit Sharma Asia Cup 2023 : రోహిత్ ముందు రెండు భారీ లక్ష్యాలు.. రాబోయే 3 నెల‌లు కీల‌కం..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 10:36 AM IST

Updated : Sep 2, 2023, 10:46 AM IST

Rohit Sharma Asia Cup 2023 : టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు రాబోయే మూడు నెల‌లు ఎంతో కీల‌కం. ఈ కాలంలోనే రెండు మోగా టోర్నీలు జర‌గ‌బోతున్నాయి. అందులో ఒక‌టి ఆసియా క‌ప్ కాగా.. రెండోది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌. ఆ విశేషాలివీ..

Rohit Sharma Asia Cup 2023
Rohit Sharma Asia Cup 2023

Rohit Sharma Asia Cup 2023 : ప్ర‌స్తుత త‌రం గొప్ప క్రికెట్ ఆట‌గాళ్ల‌లో రోహిత్ శ‌ర్మ ఒక‌డు. వ‌న్డేల్లో అత్య‌ధిక డ‌బుల్ సెంచ‌రీలు సాధించిన ప్లేయర్​గా రోహిత్​కు మంచి రికార్డు ఉంది. అటు బ్యాటర్​గా, ఇటు కెప్టెన్​గా మంచి ఫామ్​లోనే రాణిస్తున్నాడు. అయితే.. ఈ రెండు విష‌యాల్లో ఇండియ‌న్ క్రికెట్ హిస్ట‌రీకి సంబంధించి రాబోయే మూడు నెలలు అతని కెరీర్‌కు అత్యంత కీలకం. వీటిలో మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తే.. చ‌రిత్ర‌లో నిలిచిపోయే అవ‌కాశాలున్నాయి. ఇంతకీ అవేంటంటే..

విరాట్​ స్థానంలో రోహిత్​.. ఆ ఘనత చూసి..
Rohit Sharma Captaincy : విరాట్ కోహ్లీకి సెలెక్టర్లకు మ‌ధ్య నెలకొన్న ప‌రిస్థితుల్లో రోహిత్ టీమ్​ఇండియా ప‌గ్గాలు చేప‌ట్టాడు. కెప్టెన్​గా కోహ్లి ప్ర‌ద‌ర్శ‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం వల్ల అత‌ను రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీలు గెల‌వ‌డంలో విఫ‌ల‌మ‌వ్వడం.. విరాట్​ కెప్టెన్సీ విషయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో విరాట్​ స్థానంలో ఎవ‌రు కెప్టెన్ అయినా.. భారీగానే అంచ‌నాలుంటాయి. ఈ నేప‌థ్యంలో సెలెక్ట‌ర్లు రోహిత్​ను సార‌థిగా ఎంపిక‌ చేశారు. ఇక రోహిత్ అప్ప‌టికే ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​గా 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించాడు. దీంతో అత‌ను టీమ్​ఇండియా కెప్టెన్ అయితే.. ఐసీసీ ఈవెంట్ల‌లో అలాంటి ఫ‌లితాల్ని అందిస్తాడ‌ని సెలెక్టర్లు ఆశించారు.

అయితే 2022లో భార‌త ఆసియా క‌ప్ ఆడే సమయానికి రోహిత్ ఫుల్ టైమ్ కెప్టెన్​గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాదిన్న‌ర కూడా కాలేదు. అంతే కాకుండా 2018 లో ఆసియా క‌ప్ గెలుచుకున్న‌ప్ప‌టికీ ఆ స‌మ‌యానికి రెగ్యుల‌ర్ కెప్టెన్ కాదు. కానీ.. 2022లో అత‌నిలో ఒత్తిడి క‌నిపించింది. మైదానంలో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, యువ‌కుల్ని హ్యాండిల్ చేసే విధానం, ఆన్ ఫీల్డ్ స్వ‌భావం తన సారధ్య బాధ్యతలపై అనేక ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాయి.

ఆ త‌ర్వాత అదే ఏడాది ఆస్ట్రేలియాలో జ‌రిగిన టీ-20 ప్ర‌పంచ క‌ప్​లో అతని తీరులో చాలా మార్పు వచ్చింది. కెప్టెన్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి కంటే ఇప్పుడు రిలాక్స్​డ్​గా ఉన్నాడు. ఆసియా క‌ప్ ఆడేందుకు టీమ్ ప్ర‌క‌టించే సంద‌ర్భంలోనూ తను విలేక‌రుల‌తో వ్య‌వ‌హరించిన తీరు, చేసిన వ్యాఖ్య‌లు కూడా బాగున్నాయి.

Rohit Sharma About Team India : టీమ్ ఆట‌గాళ్ల స్వేచ్ఛ విష‌యంలోనూ రోహిత్​లో మార్పు వ‌చ్చింది. " ఒక‌ట్రెండు మ్యాచుల్లో ప్ర‌ద‌ర్శ‌న స‌రిగా లేనంత మాత్రాన వాళ్ల‌ని జ‌డ్జ్ చేయలేం. మా జ‌ట్టులో కుర్రాళ్లంద‌రికీ చాలా సామ‌ర్థ్య‌ముంది. క్లిష్ట స‌మ‌యాల్లో వారిని ఇంకా ప్రోత్స‌హిస్తాం." అని ఒకానొక సంద‌ర్భంలో రోహిత్ అన్నాడు.

టీమ్​ఇండియాలో రోహిత్​కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లి కంటే ముందుగానే అంత‌ర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. అయితే.. స్థిర‌త్వం లేక‌పోవ‌డం, పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ వల్ల 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్పున‌కు దూర‌మ‌య్యాడు. కానీ అరంగేట్రం చేసిన ఆరేళ్ల త‌ర్వాత 2013 లో ఓపెన‌ర్​గా ప్ర‌మోట్ అయిన త‌ర్వాత నుంచి త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. భారీ ప‌రుగులు సాధించ‌డం ప్రారంభించాడు.

చాలా కాలం పాటు ఇండియా సంప్ర‌దాయ క్రికెట్ ఆడ‌టం కొనసాగించింది. కానీ గంగూలీ, ధోనీలు ఈ ట్రెండ్ మార్చి కొత్త రికార్డులు సృష్టించారు. అయితే రోహిత్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, అతను ఇన్నింగ్స్ అంతటా అటాకింగ్​పై దృష్టి సారించాడు. ఇప్పటికీ ఆ పద్ధతినే కొనసాగిస్తున్నాడు.

Rohit Sharma Asia Cup 2023 : ఈ ఏడాది వన్డేల్లో ముఖ్యంగా పవర్‌ప్లేలలో 81.33 సగటుతో 111.41 స్ట్రైక్ రేట్ తో రాణించాడు.సార‌థిగా రోహిత్‌.. 27 మ్యాచ్‌లలో 55.95 సగటుతో 1175 పరుగులు చేశాడు. ఇందులో ఒక డ‌బుల్ సెంచ‌రీ ఉండ‌టం విశేషం. రోహిత్ ప‌రుగులు ఈ ఆసియా క‌ప్‌, వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్​ల‌లో జ‌ట్టుకు చాలా అవ‌స‌రం. ఈ ఆసియా క‌ప్‌, వ‌న్డే ప్రపంచ్ క‌ప్ టోర్నీలు రోహిత్ కెంతో కీల‌కం. వీటిపైనే త‌న కెప్టెన్సీ ప‌ద‌వి ఆధార‌ప‌డి ఉంది.

ఒకే జట్టుపై అత్య‌ధిక సెంచ‌రీల లిస్ట్​లో మనోళ్లదే హవా.. ఆ దేశంపై విరాట్, రోహిత్, సచిన్ పూర్తి డామినేషన్

Rohit Sharma ODI World Cup 2023 : 'ఆ విషయం తెలిసి నా గుండె బద్ధలైంది'

Last Updated : Sep 2, 2023, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.