ETV Bharat / sports

ధావన్ ఔట్.. ఇషాన్ ఇన్.. సెలక్టర్ల మాటేంటంటే!

author img

By

Published : Sep 9, 2021, 10:33 AM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) కోసం టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే.. శ్రేయస్​ అయ్యర్​ను పక్కనపెట్టి ఇషాన్​ కిషన్​కు(Ishan Kishan News) జట్టులో స్థానం కల్పించడంపై వివరణ ఇచ్చారు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు చేతన్ శర్మ. శిఖర్​ ధావన్​కు చోటు దక్కకపోవడానికి కారణాలు తెలిపారు కొందరు క్రికెట్ విశ్లేషకులు.

Ishan kishan
ఇషాన్ కిషన్

అక్టోబర్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ మ్యాచ్​లకు టీమ్​ఇండియా స్క్వాడ్​ను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. అయితే.. శిఖర్​ ధావన్, యుజ్వేంద్ర చాహల్​ వంటి సీనియర్​ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు. యువ బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​ను(Shreyas Iyer News) కూడా పక్కనపెట్టారు. అయ్యర్​ స్థానంలో ఇషాన్​ కిషన్​ను తీసుకోవడానికి కారణమేంటో జట్టు ప్రకటన అనంతరం వివరించారు సెలక్షన్ ప్యానెల్ అధ్యక్షుడు చేతన్ శర్మ.

"ఇషాన్​ కిషన్​ ఓపెనర్​లా ఆడగలడు. మిడిలార్డర్​లో కూడా రాణించగలడు. ఇప్పటికే కిషన్​ వన్డేల్లో ఆడాడు. తొలి మ్యాచ్​లో అర్ధసెంచరీ చేశాడు. మిడిలార్డర్, స్పిన్​​లో కూడా అతడు బాగా ఆడతాడు. అలాగే లెఫ్ట్​ హ్యాండ్​ బ్యాట్స్​మన్ జట్టుకు అవసరం. అందుకే శ్రేయస్​కు బదులుగా ఇషాన్​కు స్థానం కల్పించాం. శ్రేయస్​ కొన్ని రోజుల వరకు క్రికెట్​ దూరంగా ఉన్నందున అతడిని స్టాండ్​బై ప్లేయర్​గా ఉంచాం."

-చేతన్ శర్మ, సెలక్షన్ ప్యానెల్ అధ్యక్షుడు.

మార్చి​లో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో శ్రేయస్​ భుజానికి గాయమైంది. దీంతో అతడు కొన్ని రోజులపాటు ఆటకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్​ అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్​ దాదాపు 4 ఏళ్ల తర్వాత టీ20 జట్టులో చోటు సంపాదించాడు.

ధావన్​కు నిరాశే..

టీ20 జట్టులో శిఖర్​ ధావన్(Shikhar Dhawan Latest News)​ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడని.. దాంతో పెద్దగా ఉపయోగం ఉండదని సెలక్టర్లు భావించినట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి. అందుకే అతడి స్థానంలో ధనాధన్​ బ్యాటింగ్​ నైపుణ్యం చూపే ఇషాన్​ కిషన్​ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి.

టీమ్ఇండియా స్క్వాడ్​:విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ(వైస్​ కెప్టెన్​), కేఎల్ రాహుల్​, సూర్య కుమార్ యాదవ్​, రిషబ్​ పంత్​(వికెట్ కీపర్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్), హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్​ చాహర్​, రవిచంద్రన్​ అశ్విన్​, అక్షర్​ పటేల్​, వరుణ్​ చక్రవర్తి, జస్ప్రిత్​ బుమ్రా, భువనేశ్వర్​ కుమార్​, మహ్మద్​ షమీ.

స్టాండ్​బై ప్లేయర్స్​: శ్రేయస్​ అయ్యర్​, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​.

ఇదీ చదవండి:T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్​ జట్టు.. మెంటార్​గా ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.