ETV Bharat / sports

'మహీ భాయ్ రైనా మాట వినండి ప్లీజ్'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 3:21 PM IST

Updated : Jan 12, 2024, 3:39 PM IST

Raina Shivam Dube: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే అఫ్గాన్​తో తొలి మ్యాచ్​లో అదరగొట్టాడు. బంతితోపాటు బ్యాట్​తోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు దూబే. అయితే మ్యాచ్ అనంతరం దూబే, రైనా మధ్య ఓ సన్నివేశం జరిగింది. అదేంటంటే?

Raina Shivam Dube
Raina Shivam Dube

Raina Shivam Dube: అఫ్గానిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్​లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బంతితో (1/9) రాణించిన దూబే, ఛేజింగ్​లో అజేయమైన హాఫ్ సెంచరీ (60)తో జట్టును గెలిపించి 'మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, దూబే మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.

దూబే ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చెన్నై కెప్టెన్​ ధోనీ 2023 ఐపీఎల్​ సీజన్​లో దూబేను కేవలం బ్యాటింగ్ ఆర్డర్​లోనే దించాడు. అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​లో దూబే బౌలింగ్ చూసిన తర్వాత అతడి గురించి ధోనీ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని రైనా అన్నాడు.' ఇవాళ మహీ భాయ్ నీ బౌలింగ్ చూస్తే, 2024 ఐపీఎల్​ సీజన్​లో చెన్నై తరఫున ప్రతీ మ్యాచ్​లో 3 ఓవర్లు పక్కా బౌలింగ్ చేయిస్తాడు' అని రైనా నవ్వతూ అన్నాడు. దీనికి వెంటనే 'ధోనీ భాయ్, రైనా అన్నా మాట వినండి' అని దూబే నవ్వుతూ అన్నాడు.

  • Suresh Raina - If Mahi bhai saw your bowling tonight then your 3 overs are fixed for CSK this season (laughs).

    Dube - Mahi bhai please listen to Raina bhai (smiles). pic.twitter.com/FYlvIjdiIz

    — 𝙎𝙖𝙪𝙧𝙖𝙗𝙝𝙫𝙠𝙛18❤️‍🔥 (@Saurabhvkf18) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ధోనీయే నా కాన్ఫిడెన్స్: మ్యాచ్​ ముగించడం ఎలాగో ధోనీ నుంచి నేర్చుకున్నానని దూబే అన్నాడు. మ్యాచ్ తర్వాత రైనా, ప్రజ్ఞాన్ ఓజాతో దూబే ముచ్చటించాడు. 'నేను మహీ భాయ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయన డెత్​ ఓవర్లలో ఎలా ఆడాలో నేర్పించారు. నా బ్యాటింగ్​కు రేంటింగ్ కూడా ఇస్తారు. దాని వల్ల నేను ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. అది నా కాన్ఫిడెన్స్​ను పెంచుతుంది. ఇక బౌలింగ్​పై కూడా శ్రద్ధ పెట్టాను. చాలా రోజుల నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అవకాశాలు అంత సింపుల్​గా రావు. నేనూ చాలా కాలం వెయిట్​ చేశా. నాకు ఈరోజు ఛాన్స్ వచ్చింది' అని దూబే అన్నాడు.

వాళ్లిద్దరూ చాలా ముఖ్యం: 2024 టీ20 వరల్డ్​కప్​లో టీమ్ఇండియాకు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా ముఖ్యం అని రైనా అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా పిచ్​లపై ఆడాలంటే రోహిత్, విరాట్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని రైనా అన్నాడు.

అందుకే గిల్​పై ఫైర్ అయ్యాను : రోహిత్ శర్మ

దంచేసిన దూబే- తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

Last Updated : Jan 12, 2024, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.