ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​గా టీమ్​ఇండియా.. మా లక్ష్యం అదే: రోహిత్

author img

By

Published : Dec 13, 2021, 10:13 PM IST

rohit sharma news
రోహిత్‌ శర్మ

హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్​తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని అన్నాడు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే తమ లక్ష్యమని చెప్పాడు.

టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే తమ లక్ష్యమని వైట్​బాల్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. త్వరలో పలు ఐసీసీ ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం తమ దృష్టంతా వాటిని సాధించడంపైనే కేంద్రీకరించామని పేర్కొన్నాడు. అలాగే, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి అని రోహిత్‌ అన్నాడు.

"త్వరలో పలు ఐసీసీ టోర్నీలు ప్రారంభం కానున్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు మేమంతా సమష్టిగా కష్టపడుతున్నాం. ప్రపంచకప్‌ సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా సిద్ధం అవుతున్నాం. ఆటగాళ్లంతా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మా దృష్టంతా మెగా టోర్నీల్లో విజయం సాధించడంపైనే కేంద్రీకరించాం. టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడమే మా లక్ష్యం"

- రోహిత్ శర్మ, టీమ్​ఇండియా వన్డే కెప్టెన్

కోచ్​తో అది చాలా ముఖ్యం..

"కోచ్‌కి, కెప్టెన్‌కి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే, ఆటగాళ్లను జట్టులోకి ఎందుకు తీసుకున్నామో, జట్టులో వారి పాత్రేంటో స్పష్టంగా వివరించగలం. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ కోసం కోచ్‌ రాహుల్‌ భాయ్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి. గతంలో నా ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు చాలా సార్లు అతడితో మాట్లాడాను. ప్రస్తుతం అతడే జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం మా జట్టుకు కలిసొచ్చే అంశం. ద్రవిడ్ నేతృత్వంలో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు వస్తాయనకుకుంటున్నాను" అని రోహిత్‌ అన్నాడు.

ఇదీ చూడండి: రోహిత్​ శర్మకు గాయం.. దక్షిణాఫ్రికా టెస్ట్​ సిరీస్​కు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.