ETV Bharat / sports

ODI WorldCup 2023 Aus VS Ind : వారెవ్వా.. చరిత్ర సృష్టించిన కోహ్లీ - వార్నర్.. ఆ అరుదైన సచిన్ రికార్డ్ బ్రేక్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 3:22 PM IST

Updated : Oct 8, 2023, 4:00 PM IST

ODI WorldCup 2023 Aus VS Ind : టీమ్​ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్​లో కోహ్లీ - వార్నర్​ సరికొత్త రికార్డ్​లను అందుకున్నారు. ఆ వివరాలు..

ODI WorldCup 2023 Aus VS Ind : చరిత్ర సృష్టించిన  కోహ్లీ - వార్నర్.. సచిన్ రికార్డ్ బ్రేక్​
ODI WorldCup 2023 Aus VS Ind : చరిత్ర సృష్టించిన కోహ్లీ - వార్నర్.. సచిన్ రికార్డ్ బ్రేక్​

ODI WorldCup 2023 Aus VS Ind : వన్డే ప్రపంచ కప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా మ్యాచ్​ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్​లో స్టార్‌ విరాట్‌ ​కోహ్లీ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 3 ఓవర్‌ వేసిన జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. అతడి బంతి ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లగా.. సెకెండ్‌ స్లిప్‌లో ఉన్న విరాట్​ డైవ్‌ చేస్తూ క్యాచ్‌ పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్‌ షాక్ అయిపోయాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్​కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

World Cup Kohli Catches : అలాగే విరాట్‌ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో అత్యధిక క్యాచ్‌లు(వికెట్‌ కీపర్‌ కాకుండా) పట్టిన భారత ప్లేయర్​గా నిలిచాడు. మిచిల్‌ మార్ష్‌ క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్‌ టోర్నీల్లో కోహ్లీ 15 క్యాచ్‌లను పట్టుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(14) పేరిట ఉండేది. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును విరాట్​ అధిగమించాడు. మాజీ దిగ్గజ క్రికెటర్స్​ కపిల్​ దేవ్​, సచిన్​(12) క్యాచులు అందుకున్నారు.

Warner 1000 runs in WorldCup : వార్నర్​ సరికొత్త రికార్డ్​.. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సరికొత్త రికార్డ్​ సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​, దక్షిణాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

ఆస్ట్రేలియా తొలి వికెట్​ కోల్పోయాక.. స్టీవ్‌ స్మిత్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా కొనసాగుతున్న వార్నర్‌ ఏడో ఓవర్‌ రెండో బాల్​కు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్‌ బాది వన్డే ప్రపంచకప్​లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో సచిన్‌ తెందుల్కర్​, ఏబీ డివిలియర్స్‌ 20 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్​ను అందుకోగా.. విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌, గంగూలీ 21, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మార్క్‌ వా, సౌతాఫ్రికా మాజీ బ్యాటర్‌ హర్షల్‌ గిబ్స్‌ 22 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్​ను చేరుకున్నారు.

Ind vs Aus World Cup 2023 : భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్​.. ఇషాన్​ ఇన్​.. గిల్​ ఔట్​

ODI World Cup 2023 : భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో 'టైగర్​ నాగేశ్వరరావు'.. కోహ్లీ సూపర్​ క్యాచ్​పై కామెంట్స్​.. వీడియో చూశారా?

Last Updated :Oct 8, 2023, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.