ETV Bharat / sports

కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు: శార్దుల్ ఠాకుర్

author img

By

Published : Feb 3, 2022, 8:33 PM IST

kohli test captaincy
కోహ్లీ టెస్టు కెప్టెన్సీ

Kohli captaincy: టెస్టు సారథ్యాన్ని కోహ్లీ వదిలేస్తాడని అనుకోలేదని బౌలర్ శార్దుల్ ఠాకుర్ అన్నాడు. ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యతో తనను పోల్చొద్దని చెప్పాడు.

Kohli news: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలకడంపై.. ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ స్పందించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గొప్ప విజయాలు సాధించిందని పేర్కొన్నాడు. అతడు టెస్టు సారథ్యాన్ని వదిలేస్తాడని ఎవరూ ఊహించలేదని చెప్పాడు. అలాగే, హార్దిక్‌ పాండ్యతో తనకు ఎలాంటి పోటీ లేదని, కెప్టెన్లు మారినా తన పాత్రలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.

kohli
కోహ్లీ

'కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం చాలా బాధాకరం. అతడు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కోహ్లీ సారథ్యంలో టీమ్ఇండియా గొప్ప విజయాలు సాధించింది. ప్రత్యేకించి విదేశాల్లో చరిత్ర సృష్టించింది. చాలా తక్కువ మ్యాచుల్లో మేం ఓడిపోయాం. అది కూడా స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యాం. ఏదేమైనా అతడు తీసుకున్న నిర్ణయాన్ని మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉంది' అని శార్దూల్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు.

* హార్దిక్‌తో నన్ను పోల్చొద్దు..

'హార్దిక్‌ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతాడు. నేను 7 లేదా 8 స్థానాల్లో క్రీజులోకి వస్తాను. మా ఇద్దరి బ్యాటింగ్‌ శైలి వేర్వేరుగా ఉంటుంది. మా మధ్య ఎలాంటి పోటీ కానీ, పోలికలు కానీ లేవు. అతడి స్థానాన్ని ఆక్రమించాలని నేనెప్పుడూ అనుకోలేదు. అతడు కూడా నాకు ఎల్లప్పుడూ మద్దతుగానే నిలిచాడు. తన అనుభవాలను నాతో పంచుకునేవాడు' అని శార్దూల్‌ చెప్పాడు.

Shardul Thakur
శార్దుల్ ఠాకుర్

* కెప్టెన్‌ మారినా.. నా పాత్ర మారదు..

'జట్టును నడిపించే సారథులు మారినా.. నా పాత్రలో ఎటువంటి మార్పు ఉండదు. ఒక్కో కెప్టెన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ, అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే.. జట్టును విజయ తీరాలకు చేర్చడం. మనం ఎవరి కెప్టెన్సీలో ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. జట్టు విజయం కోసం ఏ మేరకు కృషి చేశామన్నదే ముఖ్యం' అని శార్దూల్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు. గతంలో ఠాకూర్‌.. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆడాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.