ETV Bharat / sports

Last IPL Mega Auction: ఇదే చివరి ఐపీఎల్ మెగా వేలమా!

author img

By

Published : Nov 30, 2021, 12:33 PM IST

ipl
ఐపీఎల్

Last IPL Mega Auction: ఐపీఎల్ సీజన్ 15 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే బీసీసీఐ మెగా వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'ఇదే చివరి ఐపీఎల్​ మెగా వేలం' అంటూ ఓ నెటిజన్​ చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది.

Last IPL Mega Auction: వచ్చే ఏడాది ఐపీఎల్​ కోసం బీసీసీఐ త్వరలోనే మెగా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం(నవంబర్ 30) అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల(IPL 2022 Players Retained ) వివరాలను సమర్పించాలని కోరింది. 8 ఫ్రాంఛైజీలు.. ఒక్కో జట్టుకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాలని నిబంధనలు కూడా రూపొందించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో మెగా వేలం మరింత ఆసక్తికరంగా మారింది. ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోవాలో తెలియక ఫ్రాంఛైజీలు తర్జనభర్జన పడుతున్నాయి.

ఈ క్రమంలో ఓ నెటిజన్​ చేసిన కామెంట్ వైరల్​గా మారింది. 'బంపర్​ అనౌన్స్​మెంట్.. ఇదే చివరి ఐపీఎల్ మెగా ఆక్షన్' అంటూ కే శ్రీనివాస్​ రావు అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే.. నిజంగా ఇదే చివరి మెగా వేలం కానుందా అనే అనుమానం కూడా చాలా మందిలో మొదలైంది.

"ఇదే చివరి ఐపీఎల్​ మెగా వేలం. దీని తర్వాత ఫ్రాంఛైజీలు తమ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకునే పనిలో పడాలి. వేలం అనేది పాత పద్ధతి. ఈ కారణంగానే మెగా వేలం ఉండబోదని నేను అభిప్రాయపడుతున్నా" అని శ్రీనివాస్​ ట్వీట్​ చేశాడు. ఇదే నిజమైతే.. కొత్త ఫ్రాంఛైజీలతో సహా 8 పాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియపై మరింత దృష్టిసారిస్తాయి.

  • Bumper announcement: This is probably the last #IPL mega auction. After this, franchises have to work on -- and create -- their own ecosystems.

    After this no mega auction for quite time (I guess forever).

    P.s.... as it is, I think auctions have gone past their sell by date.

    — KSR (@KShriniwasRao) November 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

పంజాబ్, సన్​రైజర్స్​ గుస్సా.. లఖ్​నవూ జట్టుపై ఫిర్యాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.