ETV Bharat / sports

T20 worldcup: 'ధోనీ, కోహ్లీ కలిసి అద్భుతాలు చేస్తారు'

author img

By

Published : Oct 12, 2021, 6:54 AM IST

మార్గనిర్దేశకుడిగా ధోనీ(Dhoni Mentor), కెప్టెన్​గా కోహ్లీ.. టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్. వ్యూహాల్లో ధోని భాగస్వామ్యం జట్టును మరింత బలంగా తయారు చేస్తుందని అన్నాడు.

Dhoni, kohli
ధోనీ, కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) టీమ్‌ఇండియా తరఫున మార్గనిర్దేశకుడు ధోని(Dhoni Mentor), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీల జోడీ అద్భుతాలు చేయడం ఖాయమని సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌(MSK Prasad on Dhoni) అభిప్రాయపడ్డాడు. ధోని సేవలు వినియోగించుకోవాలని భావించడం గొప్ప నిర్ణయమని తెలిపాడు.

"బీసీసీఐ మంచి పని చేసింది. టీమ్‌ఇండియాకు ధోనీని మార్గనిర్దేశకుడిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయం. ధోని, రవిశాస్త్రిలతో విరాట్‌కు మంచి సమన్వయం ఉంది. ధోని సారథ్యంలో కోహ్లి ఎక్కువకాలం ఆడాడు. రవిశాస్త్రి కోచ్‌గా విరాట్‌ ఎన్నో సిరీస్‌లు నెగ్గాడు. వ్యూహాల్లో ధోని భాగస్వామ్యం జట్టును మరింత బలంగా తయారు చేస్తుంది. క్రికెట్లో ధోని అపర మేధావి. పొట్టి కప్పులో టీమ్‌ఇండియా తరఫున ధోని, కోహ్లీల జోడీ అద్బుతాలు చేస్తుంది" అని ఎమ్మెస్కే చెప్పాడు.

ఇదీ చదవండి:

కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణమదే: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.