ETV Bharat / sports

ఐపీఎల్‎లో అదరగొట్టినా టీమ్​ఇండియాలో స్థానం దక్కని ప్లేయర్లు వీరే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 11:55 AM IST

Updated : Dec 7, 2023, 12:20 PM IST

Most Underrated Players in IPL
Most Underrated Players in IPL

Most Underrated Players in IPL : దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఊరించే ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఐపీఎల్‎లో అదరగొట్టిన చాలామంది ప్లేయర్లకు టీమ్​ఇండియాలో మాత్రం చోటు దక్కలేదు. ఇంతకీ ఆ క్రీడాకారులు ఎవరో తెలుసుకుందాం.

Most Underrated Players in IPL : మన దేశంలో క్రికెట్ అంటే నచ్చని అభిమానులు ఉండరు. తీరిక దొరికనప్పుడల్లా బ్యాట్, బాల్ పట్టుకుని గ్రౌండ్లో దిగి క్రికెట్ ఆడటం చాలా మంది హాబీ. అందుకే దేశంలో క్రికెట్ అంటే మోజు ఎక్కువ. అంతర్జాతీయ టోర్నీలైనా ఐపీఎల్ మ్యాచ్​లు అయినా అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఐపీఎల్ వచ్చాక దేశంలో క్రికెటర్లకు, క్రికెట్ ప్రియుల ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.

ప్రస్తుతం టీమ్ఇండియాకు ఆడుతున్న చాలా మంది క్రికెటర్లు ముందుగా ఐపీఎల్​లో తామేంటో నిరూపించుకున్నవారే. అయితే కొంతమంది దురదుష్టవశాత్తు టీమ్​ఇండియాలో చోటు సంపాదించలేకపోయారు. బ్లూ జెర్సీ మెరవలేకపోయారు. అలాంటి వారిలో టాప్ టెన్ ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • పాల్ వాల్తాటి
    ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో పాల్ వాల్తాటి మంచి ప్రతిభ చక్కని ప్రతిభ కనిపించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాల్ వాల్తాటి అంతకు ముందే అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో ఆడాడు. 2002లో ప్రపంచ కప్ అండర్ 19 టోర్నీలో ఆడిన పాల్ వాల్తాటి... కంటి గాయం కారణంగా సీనియర్ జట్టులోకి ప్రవేశించలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‎తో జరిగిన మ్యాచ్‎లో 120 పరుగులు చేసిన వాల్తాటి తన పేరును గుర్తుండిపోయేలా చేశాడు.
  • సిద్ధార్థ్ త్రివేది
    2008 నుంచి 2013 వరకు ఐపీఎల్ చూసిన చాలామందికి సిద్ధార్థ్ త్రివేది ఎవరో తెలిసే ఉంటుంది. 2010 తర్వాత ఐపీఎల్‎లో అద్భుత ప్రదర్శన చేసి టాప్ ప్లేయర్​గా గుర్తింపు పొందాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 65 మ్యాచుల్లో 76 వికెట్లు పడగొట్టాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో కెరీర్‎ను అర్థాంతరంగా ముగించాడు త్రివేది. ఆ కుంభకోణంలో త్రివేది పాత్ర లేకపోయినా ఆ తర్వాత జరిగిన ఏ ఐపీఎల్ టోర్నీ‎లోనూ సిద్ధార్థ్ త్రివేది కనిపించలేదు. ఇతర దేశవాలీ మ్యాచ్‎లకు కూడా సిద్ధార్థ్ దూరంగా ఉండిపోయాడు.
  • 3. Siddharth Trivedi:

    Unsung Hero of that 2008 Warne" s="" rr.="" played="" good="" in="" 2-3="" seasons.="" don't="" know="" where="" he="" lost="" after="" that!4="" pic.twitter.com/BQoJeymrJX

    — Souvik Roy (@souvikroy_SRT) January 11, 2023 ' class='align-text-top noRightClick twitterSection' data=' '>
  • సర్పరాజ్ ఖాన్
    బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సర్పరాజ్ ఖాన్ ఐపీఎల్‎లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అమ్ముల పొదిలో దాచుకున్న.. తనకే సాధ్యమైన షాట్లతో అసాధారణ బ్యాటర్‎గా గుర్తింపు తెచ్చుకున్నాడు సర్పరాజ్ ఖాన్. 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మారిన సర్పరాజ్ ఖాన్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనూ ఆడాడు. మొత్తం 50 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 585 పరుగులు చేశాడు. కానీ సర్పరాజ్ ఖాన్ సీనియర్ల జట్టులో స్థానం దక్కించుకోలేక పోయాడు.
  • ఈశ్వర్ పాండే
    2013-2015 మధ్య ఐపీఎల్ ఆడిన ఈశ్వర్ పాండే అందరి మన్ననలు అందుకున్నాడు. ఆ కాలంలో మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పుణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్లలో ఆడిన ఈశ్వర్ పాండే 25 మ్యాచ్‎లలో 18.7 ఎకానమీతో 68 వికెట్లు పడగొట్టాడు. అయితే 2016 ఐపీఎల్ వేలంలో ఆదరణ లేక ఈశ్వర్ పాండే కెరీర్‎ను ముగించాడు
  • శ్రేయాస్ గోపాల్
    ముంబ ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రేయాస్ గోపాల్ 47 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. మధ్యలో బ్యాటర్‎గా కూడా తన ప్రతిభ చూపాడు శ్రేయాస్ గోపాల్. కీలక మ్యాచ్లో 48 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. 2014 నుంచి 2017 వరకు ఐపీఎల్ ఆడిన శ్రేయాస్ గోపాల్... భారత జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు.
  • ప్రవీణ్ తాంబే
    ప్రవీణ్ తాంబే కూడా ఐపీఎల్లో మంచి రికార్డులను నమోదు చేసిన క్రికెటర్లలో ఒకడు. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్రవీణ్ తాంబే ఐపీఎల్ కెరీర్లో మంచి సక్సెస్ రేట్ నమోదు చేశాడు. కుడి చేతి వాటం స్పిన్నర్ అయిన ప్రవీణ్ తాంబే ఆడిన 22 మ్యచ్ లలో 28 వికెట్లు పడగొట్టాడు. 7.75 సగటుతో ప్రవీణ్ తాంబే మంచి రికార్డు నమోదు చేశాడు.
  • Pravin Tambe, at the age of 51, is the 𝙈𝙤𝙨𝙩 𝙎𝙚𝙖𝙧𝙘𝙝𝙚𝙙 𝙎𝙥𝙤𝙧𝙩𝙨𝙥𝙚𝙧𝙨𝙤𝙣 𝙊𝙣 𝙂𝙤𝙤𝙜𝙡𝙚 𝙄𝙣 𝙄𝙣𝙙𝙞𝙖 in 2022.#WeAreTKR | #PravinTambe pic.twitter.com/CBnbOuvCWw

    — KnightRidersXtra (@KRxtra) December 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • షాదాబ్ జకాతి
    భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఆడలేకపోయిన అత్యంత అండర్ రేటెడ్ ఆటగాళ్లలో షాదాబ్ జాకాతి ఒకడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో షాదాబ్ జకాటి పేరు సర్వసాధారణంగా వినిపించేది. 2009 నుంచి 2013 వరకు సీఎస్కే తరఫున.. 2014లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2017లో గుజరాత్ లయన్స్‎కు మారాడు.
  • రజత్ భాటియా
    పదకొండు మంది జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా రజత్ భాటియా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కెరీర్‎లో 342 వికెట్లు పడగొట్టిన భాటియా 2008 నుంచి 2017 వరకు ఐపీఎల్‎లో కొనసాగాడు. కోల్‎కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో ఐపీఎల్ విజేతగా నిలిచిన ఈ బౌలర్ విశేష ప్రతిభ చూపినా భారత జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.
  • మనన్ వోహ్రా
    ఐపీఎల్‎లో అత్యంత గుర్తింపు పొందిన ఆటగాళ్లలో మనన్ వోహ్రా ఒకరు. 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఐపీఎల్‎లో ప్రవేశించిన మనన్ వోహ్రా అభిమానుల ఆదరణ సంపాదించాడు. 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మారిన వోహ్రా... ఆ మరుసటి ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లిపోయాడు. కెరీర్లో 53 ఇన్నింగ్స్ ఆడిన మనన్ వోహ్రా మంచి బ్యాట్స్‎మన్‎గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
  • మన్వీందర్ బిస్లా
    వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ అయిన మన్వీందర్ బిస్లా కోల్ కతా నైట్ రైడర్స్ అభిమానుల నుంచి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 2010 నుంచి 2015 వరకు ఐపీఎల్ ఆడిన మన్వీందర్ 39 మ్యాచ్‎లలో 798 పరుగులు చేసి తాను ఎంత ముఖ్యమైన ప్లేయరో చాటిచెప్పాడు. 2012లో కేకేఆర్ జట్టు ఫైనల్స్ విజేతగా నిలవడానికి మన్వీందర్ కీలక పాత్ర పోషించాడు. ఆ ఇన్నింగ్స్‎లో 89 పరుగులు చేసి తన జట్టును ఫైనల్స్ విజేతగా నిలపడమే కాకుండా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అయినప్పటికీ టీం ఇండియాలో మన్వీందర్ స్థానం సంపాదించలేకపోయాడు.
  • 3. Siddharth Trivedi:

    Unsung Hero of that 2008 Warne" s="" rr.="" played="" good="" in="" 2-3="" seasons.="" don't="" know="" where="" he="" lost="" after="" that!4="" pic.twitter.com/BQoJeymrJX

    — Souvik Roy (@souvikroy_SRT) January 11, 2023 ' class='align-text-top noRightClick twitterSection' data=' '>

తొలి టీ20 ఇంగ్లాండ్​దే - పోరాడి ఓడిన టీమ్ఇండియా

'నడవలేని స్థితి వరకు ఐపీఎల్‌ ఆడతా- ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి అదే!'

Last Updated :Dec 7, 2023, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.