ETV Bharat / sports

INDWvsAUSW: చారిత్రక డేనైట్ టెస్టు కోసం జట్టు ప్రకటన

author img

By

Published : Aug 24, 2021, 9:30 PM IST

టీమ్ఇండియా మహిళలు త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఓ డే నైట్ టెస్టుతో పాటు టీ20, వన్డే సిరీస్​లో తలపడనున్నారు. అందుకోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ.

BCCI
బీసీసీఐ

ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడింది భారత మహిళా జట్టు. ఈ మ్యాచ్​ను డ్రా చేసుకుని ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. తొలిసారి ఓ డేనైట్ టెస్టులో తలపడబోతుంది. ఓ టెస్టుతో పాటు ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనుంది. పెర్త్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు గులాబీ బంతి టెస్టు జరుగుతుంది. ఈ క్రమంలోనే జట్టును ప్రకటించింది బీసీసీఐ.

చారిత్రక డేనైట్ టెస్టుతో పాటు వన్డే సిరీస్​కు సారథ్యం వహించనుంది మిథాలీ రాజ్. హర్మన్​ప్రీత్ కౌర్ సారథ్యంలో టీ20 సిరీస్​ ఆడనుంది. టెస్టు, వన్డే జట్టులో సీనియర్ క్రికెటర్లు హర్మన్​ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ వారి స్థానాలను కాపాడుకున్నారు. షెఫాలీ వర్మ మరోసారి ఓపెనర్​గా సత్తాచాటేందుకు సిద్ధమైంది. అలాగే ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ప్రదర్శన కనబర్చిన స్నేహ్ రానా ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికైంది. ప్రియా పూనియా, ఇంద్రాని రాయ్​లకు చోటు దక్కలేదు.

అలాగే టీ20 జట్టులో పెద్దగా మార్పూలేమీ జరగలేదు. రిచ్ ఘోష్​ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనుంది. రేణుకా సింగ్, యాస్తికా భాటికాకు తొలిసారి అవకాశం దక్కింది.

టెస్టు, వన్డే జట్టు

మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్​ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, పూనమ్ రౌత్, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, యాస్తికా భాటియా, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, జులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రిచా ఘోష్, ఏక్తా బిస్త్.

టీ20 జట్టు

హర్మన్​ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, యాస్తికా భాటియా, శిఖా పాండే, మేఘనా సింగ్, పూజా వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రేణుకా సింగ్.

ఇవీ చూడండి: ms dhoni: సిక్సులు బాదాడు.. బంతి కోసం వెతికాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.