ETV Bharat / sports

క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ టెస్టు ఇదే.. ఏకంగా 9 రోజులు!

author img

By

Published : Dec 18, 2021, 1:16 PM IST

Longest Test Match in Cricket History: క్రికెట్ చరిత్రలో ఓ టెస్టు మ్యాచ్​ ఏకంగా తొమ్మిది రోజులు జరిగింది. ఈ టెస్టు మ్యాచ్​కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ENG vs SA
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా

Longest Test Match in Cricket History: ఒక టెస్టు మ్యాచ్​ సాధారణంగా నాలుగు లేదా ఐదు రోజులు జరుగుతుంది. కానీ, ఓ టెస్టు మ్యాచ్​ చరిత్రలో నిలిచిపోయేలా 9 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఇంతకీ ఆ మ్యాచ్​లో తలపడ్డ జట్లు ఏవి?. ఆ టెస్టు ఫలితం ఏమై ఉంటుంది? మొదలైన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

'టైమ్​లెస్​ టెస్టు'

1938-39లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య ఈ టెస్టు మ్యాచ్​ జరిగింది. ఇరు జట్ల మధ్య డర్బన్​ వేదికగా జరిగిన ఈ ఐదో టెస్టు.. క్రికెట్​ చరిత్రలో అత్యధిక రోజులు ఆడిన టెస్టుగా నిలిచింది. 1939 మార్చి 3-14 వరకు జరిగిన ఈ మ్యాచ్​లో చివరి రోజు మరో 41 పరుగులు చేసి ఉంటే ఇంగ్లాండ్ విజేతగా నిలిచేది. కానీ, ఆటగాళ్లు బ్రిటన్ వెళ్లే బోటును అందుకోవాల్సి ఉన్న నేపథ్యంలో వారు ముందుగానే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్​ డ్రా అయింది. ఇలా ఎక్కువ రోజులు జరిగి, మ్యాచ్​ ఫలితం డ్రాగా ముగిసినందున దీనికి 'టైమ్​లెస్​ టెస్టు' అనే పేరు వచ్చింది.

హిస్టరీ గేమ్..

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్​లో 530 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్​ ఆడిన ఇంగ్లాండ్ 316 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 481 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 696 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​ ఆరంభించి 9వ రోజు ఆట ముగిసేసమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 654 పరుగులు చేసింది. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున ఏ మెల్​విల్లే, పీజీవీ వాండర్ బిజిల్, ఈఏబీ రోవన్, బీ మిచెల్​ ఇంగ్లాండ్ తరఫున పాల్ గిబ్, బిల్ ఎడ్రిచ్, వాల్లీ హమ్మండ్ కీలక ఆటగాళ్లుగా నిలిచారు.

ఇదీ చదవండి:

సచిన్​తో స్నేహం చెక్కుచెదరనిది: కాంబ్లీ

ఎదురులేని రూట్.. సచిన్, గావస్కర్​లను దాటేసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.