ETV Bharat / sports

ప్రాక్టీస్​లో రాహుల్​కు గాయం.. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా?

author img

By

Published : Dec 21, 2022, 7:03 PM IST

kl rahul team india
kl rahul

టీమ్​ ఇండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్​ రాహుల్​ గాయపడ్డాడు. గురువారం జరగనున్న రెండో టెస్ట్​ మ్యాచ్​ కోసం ప్రాక్టీస్​ చేస్తున్న సమయంలో అతని చేతికి గాయమైనట్లు సమాచారం.

టీమ్​ ఇండియా తాత్కాలిక కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ గాయపడ్డాడు. గురువారం జరగనున్న రెండో టెస్ట్​ మ్యాచ్​ కోసం ప్రాక్టీస్​ చేస్తున్న సమయంలో అతని చేతికి గాయమైనట్లు సమాచారం. అయితే అతని గాయం అంత తీవ్రమైనది కాదని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్​ ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రెండో టెస్టులో రాహుల్‌ ఆడనున్నాడా లేదా అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.​

ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం వల్ల చివరి వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ సైతం ఇప్పుడు మ్యాచ్​కు దూరమవుతున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.