ETV Bharat / sports

బౌలింగ్​ ఇరగదీస్తున్న ఉమేశ్​.. 'పంజాబ్'​ అంటే ఎందుకంత ఇష్టం?

author img

By

Published : Apr 2, 2022, 8:11 AM IST

KKR vs PBKS: ఐపీఎల్​-2022 సీజన్లో అద్భుత బౌలింగ్​తో అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుంటున్నాడు టీమ్​ఇండియా సీనియర్​ పేసర్​ ఉమేశ్​ యాదవ్​. ప్రస్తుతం కోల్​కతాకు ఆడుతున్న ఉమేశ్​.. 3 మ్యాచ్​ల్లో 8 వికెట్లతో పర్పుల్​ క్యాప్​ హోల్డర్​గా ఉన్నాడు. రెండింట్లో మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అతడే. అయితే.. పంజాబ్ కింగ్స్​​ అంటే చెలరేగిపోతున్న ఉమేశ్​ గణాంకాలు ఓసారి చూద్దాం..

KKR vs PBKS: Umesh Yadav breaks two huge IPL records
KKR vs PBKS: Umesh Yadav breaks two huge IPL records

KKR vs PBKS: ఉమేశ్​ యాదవ్​.. గత రెండు ఐపీఎల్​ సీజన్లలో మొత్తం కలిపి రెండు మ్యాచ్​లే ఆడాడు. ఫామ్​ లేమి, గాయాల బారినపడటం, ధారాళంగా పరుగులివ్వడం, టీమ్​ఇండియాలో ఎవరికైనా విశ్రాంతి/గాయపడితేనే జట్టులో స్థానం.. ఇదీ కొన్నేళ్ల కిందటి వరకు ఉమేశ్​ పరిస్థితి. ప్రస్తుతం అతడి వయసు 34 ఏళ్లు. కుర్రాళ్లతో పోటీగా ప్రస్తుత ఐపీఎల్​లో రెచ్చిపోతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆడుతున్న ఉమేశ్​.. ఇప్పటివరకు 3 మ్యాచ్​ల్లో 8 వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్​ గెలిచిన రెండింట్లో మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అతడే కావడం విశేషం. శుక్రవారం పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో తన ఐపీఎల్​ కెరీర్​ అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు. 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్​ కూడా ఉంది. 2012లో దిల్లీ 4/24, 2017లో కోల్​కతాపై 4/33.. అతడి గత అత్యుత్తమ ప్రదర్శనలుగా ఉన్నాయి.

పంజాబ్​ అంటే పూనకం వచ్చినట్లు: సాధారణంగా కొందరు ఆటగాళ్లు.. అదీ ఇదీ అని తేడా లేకుండా అన్ని జట్లపై రాణిస్తుంటారు. మరికొందరికి ప్రియమైన ప్రత్యర్థులు ఉంటారు. అదే కోవలోకి వస్తాడు ఉమేశ్​. పంజాబ్​ కింగ్స్​పై అతడి గణాంకాలు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన రికార్డు సాధించాడు ఉమేశ్​. నరైన్​ను దాటి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఒక్క పంజాబ్​పైనే 33 వికెట్లు తీశాడు. మరే బౌలర్​ ఒకే టీంపై ఇన్ని వికెట్లు తీయలేదు. ఈ లిస్ట్​లో ఎవరెవరున్నారంటే?

  1. ఉమేశ్​ యాదవ్​ - 33 vs పంజాబ్​ కింగ్స్​
  2. సునీల్​ నరైన్​ - 32 vs పంజాబ్​ కింగ్స్​
  3. లసిత్​ మలింగ - 31 vs చెన్నై సూపర్​ కింగ్స్​
  4. డ్వేన్​ బ్రావో - 31 vs ముంబయి ఇండియన్స్​
  5. అమిత్​ మిశ్రా - 30 vs రాజస్థాన్​ రాయల్స్​
  • పంజాబ్​ కింగ్స్​తో ఆడిన మ్యాచ్​ల్లో ఇప్పటివరకు 6 మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డులు దక్కించుకున్నాడు ఉమేశ్​ యాదవ్​. ఓ ప్రత్యర్థి జట్టుపై ఎక్కువ సార్లు ఈ రికార్డు సాధించిన ప్లేయర్​గా నిలిచాడు ఉమేశ్​. డెక్కన్​ ఛార్జర్స్​పై 5 సార్లు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచి యూసఫ్​ పఠాన్​ రెండో స్థానంలో ఉన్నాడు. కేకేఆర్​పై రోహిత్​ 5 సార్లు, కేకేఆర్​పైనే గేల్​ 5 సార్లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • 3 అంతకంటే ఎక్కువ వికెట్లు.. ఓ జట్టుపై ఎక్కువసార్లు తీసిన ఘనత ఉమేశ్​కే దక్కుతుంది. పంజాబ్​పై ఇప్పటివరకు 9 సార్లు 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. మరే ఇతర ప్లేయర్​ ఓ ప్రత్యర్థి జట్టుపై ఐదు కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించలేకపోయారు.

ఇవీ చూడండి: లఖ్​నవూ ప్లేయర్ల వినూత్న వేడుకలు​.. గంభీర్​ వింటేజ్​ పంచ్​!

IPL 2022: చెలరేగిన ఉమేశ్​.. రసెల్ విధ్వంసం.. పంజాబ్​పై కోల్​కతా విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.