ETV Bharat / sports

కపిల్​దేవ్​కు రోహిత్ కౌంటర్. కోహ్లీ గురించి మీకేం తెలుసంటూ.

author img

By

Published : Jul 11, 2022, 9:01 AM IST

Updated : Sep 6, 2022, 2:49 PM IST

Rohit sharma comment on kapil dev: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని టీ 20 జట్టు నుంచి తొలగించాలని కపిల్​ దేవ్​ చేసిన వ్యాఖ్యలపై రోహిత్​శర్మ స్పందించాడు.​ కపిల్​ దేవ్​కు డ్రెస్సింగ్ రూమ్​ లోపల ఏం జరుగుతుందో తెలియదని​ కోహ్లీని వెనకేసుకొచ్చాడు హిట్​మాన్.

rohit sharma on virat kohli
rohit sharma on virat kohli

Rohit sharma comment on kapil dev: భారత మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీపై దిగ్గజ ఆటగాడు కపిల్​దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీని టీ20 జట్టు నుంచి తొలగించాలని కపిల్​ దేవ్​ చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్​శర్మ కౌంటర్​ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్​ లోపల ఏం జరుగుతుందో కపిల్​దేవ్​కు తెలియదన్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకున్న అనంతరం రోహిత్​శర్మ మాట్లాడాడు.

"డ్రెస్సింగ్ రూమ్​లో ఏం జరుగుతుందో కపిల్​దేవ్​కు తెలియదు. మా జట్టు సభ్యులందరం కలిసి చర్చించుకుంటాం. ఆటగాళ్ల ప్రద్శరన ఎలా ఉన్నా వారికి అండగా నిలుస్తాం. మైదానంలో ఏం జరిగిందన్నది కాదు. డ్రెస్సింగ్​ రూమ్​లో ఏం జరుగుతున్నదే ముఖ్యం. ఆటగాడి స్థానం గురించి మాట్లాడే నిపుణులు ఎవరో నాకు తెలియదు. ఒక ఆటగాడిగా అతడి సామర్థ్యాన్ని చూసి అండగా ఉంటాం. దశబ్దానికి పైగా అద్భుతంగా ఆడుతున్నప్పుడు.. కొన్ని సంవత్సరాలుగా ఆడకపోయినా ముఖ్యం కాదు. ఆటగాడికి ఫామ్​ అనేది వస్తుంది, పోతుంది. కానీ ఆటగాడి సామర్థ్యం, నాణ్యత మారదు. ఒక ఆటగాడిపై కామెంట్లు చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఆటగాడి విలువ మాకు తెలుసు."
-రోహిత్​ శర్మ, భారత కెప్టెన్​

విరాట్ కోహ్లీపై కపిల్​దేవ్ ఏం అన్నాడంటే: "టెస్టుల్లో ప్రపంచ నెంబర్​ 2 బౌలర్​ అశ్విన్​ను జట్టు నుంచి తప్పించినప్పుడు.. టీ20ల్లో ఆడే 11 మంది నుంచి కోహ్లీని బెంచ్​కే ఎందుకు పరిమితం చేయకూడదు. ప్రపంచ నెంబర్​ 2 బౌలర్​ను పక్కనపెట్టినప్పుడు.. నెంబర్​ 1 బ్యాటర్​ను కూడా వదులుకోవచ్చు. ప్రస్తుతం విరాట్​ బ్యాటింగ్​ స్థాయి మునపటిలా లేదు. అతను తన ప్రదర్శనల కారణంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జట్టులో స్థానం కోసం పోటీ పడాలి. విరాట్​ను అధిగమించేందుకు యువకులు ప్రయత్నించాలి" అని కపిల్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

Last Updated :Sep 6, 2022, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.