ETV Bharat / sports

'విరాట్, రాహుల్ క్రీజులో ఉంటే రిలాక్స్ అయ్యేవాడ్ని కాదు'- ఆసీస్ మాజీ కోచ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 1:11 PM IST

Updated : Dec 31, 2023, 1:30 PM IST

Justin Langer Praises Virat Kohli Kl Rahul
Justin Langer Praises Virat Kohli Kl Rahul

Justin Langer Praises Virat Kohli Kl Rahul : టీమ్ఇండియా స్టార్లు కోహ్లీ, రాహుల్ క్రీజులో ఉంటే తాను రిలాక్స్​ అయ్యేవాడు కాదని ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు.

Justin Langer Praises Virat Kohli Kl Rahul : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​పై ఆస్ట్రేలియా మాజీ హెడ్​ కోచ్​ జస్టిన్ లాంగర్ ప్రశంసలు కురిపించాడు. తాను కోచ్​గా ఉన్న సమయంలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్​లో విరాట్, రాహుల్ ఔటయ్యేంత వరకు రిలాక్స్ ఆయ్యేవాడు కాదని అన్నాడు. 'నేను ఆస్ట్రేలియా కోచ్​గా​ ఉన్నప్పుడు టీమ్ఇండియాతో మ్యాచ్​లు జరుగుతుంటే విరాట్, రాహుల్ ఔటయ్యే దాకా రిలాక్స్ అయ్యేవాడిని కాదు' అని లాంగర్ రీసెంట్​గా లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

అయితే 2024 ఐపీఎల్​కుగాను తమ జట్టు హెడ్​ కోచ్​గా లాంగర్​ను లఖ్​నవూ ఫ్రాంచైజీ ఇటీవల నియమించుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఫ్రాంచైజీతో లాంగర్ మాట్లాడాడు. ఐపీఎల్​ అనేది తనకు ఒలింపిక్స్​తో సమానం అని అభిప్రాయపడ్డాడు. 'నా ఫ్రెండ్స్​ రికీ పాంటింగ్, టామ్​ మూడీ చాలా కాలం నుంచి ఐపీఎల్​లో సేవలందిస్తున్నారు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ గురించి రికీ నాకు ఎప్పుడూ చెబుతుంటాడు. డొమెస్టిక్ క్రికెట్​ లీగ్​ల్లో ఐపీఎల్​ చాలా పెద్దది. ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒలింపిక్స్​ లాంటింది. అటువంటి పెద్ద టోర్నీలో నేనూ భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని లాంగర్ అన్నాడు.

  • Justin Langer said, "IPL is like the Olympic Games. It is so big. Every game is a spectacle, it is so well received and supported around the world. To have the opportunity to be a part of that is something I am very, very excited about". (LSG). pic.twitter.com/isy2ufC9ex

    — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జస్టిన్ లాంగర్ 2018-2022 మధ్య టెన్యూర్​లో ఆస్ట్రేలియా హెడ్​ కోచ్​గా వ్యవహరించాడు. లాంగర్ కోచ్​గా ఉన్న సమయంలోనే ఆసీస్ 2021లో తొలి టీ20 వరల్డ్​కప్ అందుకుంది. ఆ తర్వాత లాంగర్ బిగ్​బాష్ టీ20 లీగ్​లోనూ ఆయా జట్లకు హెడ్​ కోచ్​గా వ్యవహరించాడు. ఇక కొన్ని రోజుల కిందట లఖ్​నవూ ఫ్రాంచైజీ ఆండీ ఫ్లవర్​ స్థానంలో లాంగర్​ను కోచ్​కు కోచ్ బాధ్యతలు అప్పగించింది.

Gambhir Quits LSG : గత రెండు సీజన్​ల్లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ జట్టుకు మెంటార్​గా ఉన్న టీమ్ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ రీసెంట్​గా ఫ్రాంచైజీని వీడాడు. అతడు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు. ఇక 2024లో గంభీర్ తిరిగి కేకేఆర్​తో కలవనున్నాడు.

లఖ్​నవూకు గంభీర్​ గుడ్​బై - మళ్లీ కోల్​కతాతో జర్నీ స్టార్ట్

లఖ్​నవూ కెప్టెన్​గా కృనాల్​.. బీసీసీఐ ​పర్యవేక్షణలో కేఎల్ రాహుల్​!

Last Updated :Dec 31, 2023, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.